దీపారాధన
ఉదయం, సాయంత్రం ఇంటి గుమ్మం వద్ద, దేవుడి గదిలో దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది.
శుభ్రత
లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. ఇల్లు ఎప్పుడూ చిందరవందరగా లేకుండా ప్రశాంతంగా ఉండాలి.
తులసి పూజ
ఇంట్లో తులసి కోట ఉండి, నిత్యం నీరు పోసి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే ఉంటుంది.
ముగ్గులు
:
ఉదయాన్నే ఇంటి వాకిలి ఊడ్చి ముగ్గు వేయడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే
వరలక్ష్మి వ్రతం
శ్రావణ మాసంలో చేసే ఈ వ్రతం అష్టైశ్వర్యాలను కలిగిస్తుందని నమ్ముతారు.
శుక్రవార పూజ
శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు లలితా సహస్రనామ పారాయణం లేదా 'మహాలక్ష్మి అష్టకం' చదవడం చాలా మంచిది.
పెద్దల గౌరవం
ఎక్కడైతే స్త్రీలను, పెద్దలను గౌరవిస్తారో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది.
లక్ష్మీ కటాక్షం కోసం
మంత్రాలు
"ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః"
వైభవ లక్ష్మి వ్రతం
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి చాలా మంది 11 లేదా 21 శుక్రవారాల పాటు ఈ వ్రతం చేస్తారు