టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ఈ కొత్త ఏడాది ఒక చేదు వార్త చెప్పింది. గత ఏడాది కాలంగా తన ప్రీమియం కస్టమర్లకు అందిస్తున్న అత్యంత ఖరీదైన ‘డిజిటల్ గిఫ్ట్’ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు రూ. 17,000 విలువైన ‘పెర్ప్లెక్సిటీ ప్రో’ (Perplexity Pro) ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌ను ఎయిర్‌టెల్ అధికారికంగా ముగించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో పెర్ప్లెక్సిటీ ప్రోకి మంచి క్రేజ్ ఉంది అనే చెప్పుకోవచ్చును. ఇది గూగుల్ సెర్చ్‌కి ప్రత్యామ్నాయంగా, మరియు అడిగిన ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలను ఇచ్చే అడ్వాన్స్‌డ్ AI టూల్. దీని వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర సుమారు 17 వేల రూపాయలు ఉంటుందని. ఎయిర్‌టెల్ తన ఎంపిక చేసిన ప్లాన్ల ద్వారా ఈ సేవను యూజర్లకు ఉచితంగా అందించేది.
ఎయిర్‌టెల్ నిబంధనల ప్రకారం, ఈ ఆఫర్ కేవలం జనవరి 16, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆ గడువు ముగియడంతో, కంపెనీ ఇప్పుడు తన ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల నుండి ఈ బెనిఫిట్‌ను తీసివేసింది. అంటే, ఇకపై కొత్తగా రీఛార్జ్ చేసుకునే వారికి ఈ ఉచిత మెంబర్‌షిప్ లభించదు.
అయితే అందరూ కంగారు పడాల్సిన పనిలేదు. ఒకవేళ మీరు జనవరి 16 లోపే ఈ ఆఫర్‌ను క్లెయిమ్ (Redeem) చేసుకుని ఉంటే, మీరు సేఫ్‌లో ఉన్నట్లే!
యాక్టివేషన్ డేట్ నుండి పూర్తి ఒక సంవత్సరం పాటు మీరు పెర్ప్లెక్సిటీ ప్రో ఫీచర్లను ఉచితంగా వాడుకోవచ్చు.
ఎవరైతే క్లెయిమ్ చేసుకోలేదో లేదా కొత్తగా జాయిన్ అయ్యారో, వారికి మాత్రం ఈ ఛాన్స్ మిస్ అయినట్లే.
సాధారణంగా టెలికాం కంపెనీలు ఇలాంటి భారీ ఆఫర్లను ప్రమోషన్ల కోసం పరిమిత కాలం మాత్రమే ఇస్తుంటాయి. ఎయిర్‌టెల్ కూడా అదే బాటలో నడిచింది. పెర్ప్లెక్సిటీ లాంటి ప్రీమియం సర్వీస్‌ను కోల్పోవడం AI ప్రియులకు కొంత నిరాశ కలిగించే విషయమే. అయినప్పటికీ, ఎయిర్‌టెల్ భవిష్యత్తులో మరిన్ని కొత్త ఆఫర్లతో వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
