AP Farmers News : రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ’ డబ్బులు రాలేదా? అయితే మార్చి 31లోపు ఇలా చేయండి!

AP Farmers News

AP Farmers News

AP Farmers News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ’ పథకం నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల గన్నవరంలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదును జమ చేశారు. అయితే, మెజారిటీ రైతుల ఖాతాల్లోకి డబ్బులు చేరినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల ఇంకా కొంతమంది రైతులకు ఈ సాయం అందలేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

మీ అకౌంట్‌లో డబ్బులు పడకపోవడానికి ప్రధాన కారణాలివే..

చాలా సందర్భాల్లో అర్హత ఉన్నప్పటికీ చిన్నపాటి తప్పుల వల్ల నిధులు నిలిచిపోతుంటాయి. అధికారులు గుర్తించిన దాని ప్రకారం.. ముఖ్యంగా కింద పేర్కొన్న సమస్యల వల్లే
బ్యాంక్ ఖాతాతో ఆధార్ నెంబర్ లింక్ కాకపోవడం.
బ్యాంక్ అకౌంట్ NPCI (National Payments Corporation of India) తో మ్యాపింగ్ జరగకపోవడం.
పీఎం కిసాన్ పోర్టల్‌లో ఈ-కేవైసీ (e-KYC) పెండింగ్‌లో ఉండటం.

డబ్బులు రాని రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదని, మార్చి 31వ తేదీలోపు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆగిపోయిన నగదు కూడా మీ అకౌంట్లోకి చేరుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందుగా మీ గ్రామంలోని లేదా వార్డు సచివాలయానికి వెళ్లి, మీ దరఖాస్తు స్థితిని తనిఖీ చేసుకోండి. అక్కడ ఉన్న డిజిటల్ అసిస్టెంట్ లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్‌ని అడిగితే మీ డబ్బులు ఎందుకు ఆగిపోయాయో స్పష్టమైన కారణం చెబుతారు.

ఈ-కేవైసీ పూర్తి చేయండి ఒకవేళ మీ కేవైసీ అప్‌డేట్ లేకపోతే వెంటనే రైతు సేవా కేంద్రంలో గానీ లేదా పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా గానీ దానిని పూర్తి చేసుకోండి.
మీ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ అయ్యిందో లేదో మీ బ్యాంక్ మేనేజర్‌ను అడిగి తెలుసుకోండి. ఫామ్ 8 లేదా 11 పూర్తి చేసి అకౌంట్ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. భూమి వివరాల్లో తప్పులు ఉంటే మీ భూమి వెబ్‌సైట్ చెక్ చేసుకుని, అవసరమైతే ఎమ్మార్వో (MRO) కార్యాలయంలో సరిచేయించుకోండి.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్ 155261 కి ఫోన్ చేయవచ్చు. లేదా 1902 నెంబర్‌కు కాల్ చేసి మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. మార్చి 31వ తేదీ గడువు లోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తే, రైతులందరికీ ప్రభుత్వం ప్రకటించిన రూ.6 వేల సాయం (కేంద్రం రూ.2 వేలు + రాష్ట్రం రూ.4 వేలు) నేరుగా అందుతుంది.