ప్రస్తుత కాలంలో థైరాయిడ్ సమస్య అనేది చాలా మందిని వేధిస్తోంది. విపరీతమైన అలసట, బరువు పెరగడం లేదా తగ్గడం వంటి లక్షణాలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. మందులు వాడుతున్నప్పటికీ, మన ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ ఆయుర్వేద కోచ్ డింపుల్ జాంగ్డా సూచించిన 5 ముఖ్యమైన ఆహార పదార్థాలు ఇవే.
1. సెలీనియం కోసం బ్రెజిల్ నట్స్
థైరాయిడ్ హార్మోన్ల (T3 మరియు T4) ఉత్పత్తిలో సెలీనియం కీలక పాత్ర పోషిస్తుంది అని . దీని కోసం ప్రతిరోజూ రెండు బ్రెజిల్ నట్స్ తీసుకుంటే సరిపోతుంది. వీటిని రాత్రి పూట నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు చాలా బాగా మెరుగుపడుతుంది.
2. అయోడిన్ – చాలా ముఖ్యం
శరీరంలో అయోడిన్ లోపం ఉంటే థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. మనం వాడే అయోడైజ్డ్ ఉప్పు (Iodised Salt) ద్వారా ఇది మనకు అందుతుంది. అలాగే స్ట్రాబెర్రీలు మరియు సముద్రపు పాచి (Seaweed) వంటి వాటిలో కూడా సహజంగా అయోడిన్ లభిస్తుంది. హార్మోన్ల సమతుల్యతకు కూడా ఇది చాలా అవసరం.
3. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే పండ్లు
థైరాయిడ్ గ్రంథిపై ఒత్తిడి తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. బెర్రీలు, చెర్రీలు, స్ట్రాబెర్రీలు వంటి పండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాక ఇవి థైరాయిడ్ కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి.
4. జింక్ కోసం గుమ్మడి గింజలు
జింక్ లోపం వల్ల కూడా థైరాయిడ్ పనితీరు మందగిస్తుంది. గుమ్మడి గింజలు (Pumpkin Seeds) జింక్ కి ఒక అద్భుతమైన వనరు. ఒక స్పూన్ గుమ్మడి గింజలను రాత్రి నానబెట్టి, ఉదయం పండ్లతో కలిపి తీసుకుంటే జింక్ శరీరానికి బాగా అందుతుంది.
5. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్
హార్మోన్ల సమతుల్యతకు మరియు శరీరంలో వాపు (Inflammation) తగ్గడానికి ఒమేగా-3 చాలా అవసరం. అవిసె గింజలు (Flaxseeds), చియా గింజలు మరియు అవిసె నూనెను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా గుండెకు కూడా మేలు చేస్తాయి.
ఈ ఆహార పదార్థాలను మీ డైట్లో చేర్చుకోవడంతో పాటు, సరైన వ్యాయామం మరియు వైద్యుల సలహాలు పాటించడం ముఖ్యం. జీవనశైలిలో చేసే ఇలాంటి చిన్న మార్పులు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి.
. https://varthaprabhanjanam.com/4-indian-students-injured-knife-attack-russian-university-ufa/
