Controversy tweet : అంత అహంకారమా..? KCR బర్త్ డే రోజు.. కవిత ట్వీట్ సంచలనం!

Controversy tweet

Controversy tweet

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తుండగా ఊహించని విధంగా ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనానికి దారితీసింది. కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవిత తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తండ్రి పుట్టినరోజు అంటే ఎంతో భావోద్వేగంతో, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ హ్యాపీ బర్త్ డే డాడీ అని పోస్ట్ చేసే కవిత ఈసారి మాత్రం కేవలం ఒక రాజకీయ నాయకుడికి విషెస్ చెప్పినట్లుగా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఆమె తన ట్వీట్‌లో ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. ఇందులో ఎక్కడా నాన్న లేదా తండ్రి అనే పదాలను వాడకపోవడంపై కెసిఆర్ ఫోటో కూడా పెట్టకపోవడంపై పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సొంత కూతురే తన తండ్రిని ఒక పరాయి వ్యక్తిలా, కేవలం ఒక పార్టీ నాయకుడిలా సంబోధించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని నెటిజన్లు నిలదీస్తున్నారు.

ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు, పదవిలో ఉన్నప్పుడు ఒకలా.. పదవి లేనప్పుడు మరోలా ప్రవర్తించడం సరికాదని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. పదవి లేకపోతే తండ్రి ఫోటో కూడా పక్కన ఉండదా? అని రాజకీయాల కంటే కుటుంబ బంధాలు తక్కువా అని ఘాటుగా స్పందిస్తున్నారు. గతంలో ఆమె హ్యాపీ బర్త్ డే డాడీ.. మీరు నా హీరో అంటూ చేసిన పాత ట్వీట్లను ఇప్పుడు స్క్రీన్ షాట్లు తీసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చూపించిన ఆత్మీయత ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు లిక్కర్ స్కామ్ కేసు తదితర పరిణామాల తర్వాత కవిత వైఖరిలో మార్పు వచ్చిందా? లేక పార్టీలో అంతర్గతంగా ఏదైనా విభేదాలు నడుస్తున్నాయా? అన్న కోణంలో కూడా రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. కేసీఆర్ అంటే ఒక నాయకుడిగానే కాకుండా, తెలంగాణ ఇంటి పెద్దగా ప్రజలు చూస్తారని, అలాంటి వ్యక్తికి తన సొంత కూతురు కనీసం ‘నాన్న’ అని పిలవకపోవడం ఆయన అభిమానులను కలచివేస్తోంది. ఏది ఏమైనా, కేసీఆర్ పుట్టినరోజు వేడుకల కంటే ఇప్పుడు కవిత చేసిన ఈ ట్వీట్ చుట్టూనే తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.