Dhurandhar 2 Day 7 Collection : భారతీయ సినీ చరిత్రలో రణవీర్ సింగ్ తన పవర్హౌస్ పర్ఫార్మెన్స్తో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. 2025 నాటి భారీ హిట్ ‘ధురంధర్’కు సీక్వెల్గా వచ్చిన ‘ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ 2) బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. విడుదలైన కేవలం ఏడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల మార్కును దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ట్రేడ్ అనలిస్ట్ నివేదికల ప్రకారం ఈ సినిమా ఇండియాలో కేవలం వారం రోజుల్లోనే రూ. 600 కోట్ల క్లబ్లో చేరిపోయింది. బుధవారం నాటికి భారత మార్కెట్లో ఈ సినిమా నికర వసూళ్లు (Net) రూ. 623.42 కోట్లుగా నమోదయ్యాయి.
ఒక సినిమా సినిమా కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి:
మొదటి రోజు (మార్చి 19): రూ. 102.55 కోట్లతో ఘనంగా ప్రారంభమైంది.
వీకెండ్ హోరు: శని, ఆదివారాల్లో వరుసగా రూ. 113 కోట్లు, రూ. 114.85 కోట్లు కొల్లగొట్టింది.
బుధవారం వసూళ్లు: వారం మధ్యలో కూడా తగ్గకుండా రూ. 47.70 కోట్లు సాధించింది. ఇందులో హిందీ వెర్షన్ వాటా రూ. 44 కోట్లు కాగా, తెలుగు వెర్షన్ ద్వారా రూ. 2.50 కోట్లు వచ్చాయి.
విదేశీ మార్కెట్లలో కూడా ‘ధురంధర్ 2’ సత్తా చాటుతోంది. ముఖ్యంగా యూకే (UK)లో రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేస్తోంది. ఓవర్సీస్ వసూళ్లు రూ. 261 కోట్లకు పైగా ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ. 1,006.50 కోట్లుగా నమోదయ్యాయి.
