Egg 65 recipe :హోటల్ స్టైల్ ఎగ్ 65 ఇంట్లోనే !!!

Egg 65 at home

Egg 65 at home

మీ ఇంట్లో ఎగ్స్ వున్నాయా !!అయితే మీ పిల్లలకు మరియు భర్తకు 5 నిమిషాలలో ఈజీగ ఎలా చేయండి ఇంకా

వాళ్ళు మీకు ప్రశంసలా వర్షం కురిపిస్తారు

చికెన్ 65, మటన్ 65, ఫిష్ 65… ఇలా రకరకాల 65 వంటకాలు మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అదే కోవలోకి కొత్తగా చేరింది ‘ఎగ్ 65’. పేరు వినగానే కొత్తగా అనిపించినా, ఇది గుడ్డుతో చేసే చాలా రుచికరమైన వంటకం. ముఖ్యంగా మాంసాహారం తినని వారు, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఎగ్ 65 ఇప్పుడు చాలా చోట్ల ప్రాచుర్యం పొందుతోంది.

సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చే పిల్లలకు మరియు ఆఫీస్ నుండి వచ్చే భర్తలకు రోజూ ఒకే రకమైన ఈవెనింగ్ స్నాక్స్ కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయాలని అనుకుంటే, ఈ ఎగ్ 65 మంచి ఆప్షన్. రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. గుడ్డులో ఉండే ప్రోటీన్ పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగచేస్తుంది .

ఎగ్ 65 తయారీకి కావాల్సిన పదార్థాలు:
గుడ్లు – 6, అల్లం – 2 ముక్కలు, వెల్లుల్లి – 6 నుంచి 10 రెబ్బలు, పచ్చిమిర్చి – 6, కొత్తిమీర – ఒక కప్పు, కరివేపాకు – ఒక కప్పు, గరం మసాలా – 4 టీ స్పూన్లు, కారం పొడి – సరిపడా, కశ్మీరీ కారంపొడి – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, పెరుగు – 2 కప్పులు, చిల్లీ సాస్ – కొద్దిగా, జీలకర్ర పొడి – 2 లేదా 3 టీ స్పూన్లు, చక్కెర – 2 టీ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ – 1 లేదా 2 కప్పులు.

తయారీ విధానం:
ముందుగా గుడ్లను ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత గుడ్లలోని పచ్చసొనను తీసేసి, తెల్లగుడ్డును మాత్రమే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలలో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, కొద్దిగా బ్రెడ్ పౌడర్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఇందులో రెండు గుడ్ల తెల్లసొన (ఎగ్ వైట్) వేసి మిశ్రమాన్ని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

బాణలిలో నూనె వేడి చేసి, ఈ ఉండలను నెమ్మదిగా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత మరో ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించాలి. అందులో పెరుగు, కశ్మీరీ కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, చిల్లీ సాస్, చక్కెర వేసి బాగా కలపాలి. చివరగా ఫ్రై చేసిన ఉండలను ఇందులో వేసి గ్రేవీ పట్టే వరకు కలిపి మంట ఆర్పాలి.

ఇలా చేస్తే ఇంట్లోనే సింపుల్‌గా, రుచికరమైన ఎగ్ 65 రెడీ. పిల్లలకు ఇష్టంగా తినిపించవచ్చు, అతిథులకు ప్రత్యేకంగా వడ్డించవచ్చు.