టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు Gambhir Offer ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ నుండి ఒక మైండ్ బ్లోయింగ్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం కోచ్‌గానో మెంటార్‌గానో మాత్రమే కాకుండా.. ఏకంగా ఫ్రాంచైజీలోనే 2 నుండి 3 శాతం వాటా ఇస్తామని యాజమాన్యం ఆఫర్ చేసిందట. ప్రస్తుతం ఈ టీమ్ యజమానులు మారుతున్న తరుణంలో, గంభీర్ లాంటి సక్సెస్‌ఫుల్ వ్యూహకర్తను సీఈఓగా తెచ్చుకోవాలని వారు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఆఫర్ ఎంత ఆకర్షణీయంగా ఉన్నా గంభీర్ దీనికి ‘ఓకే’ చెప్పడం అంత ఈజీ కాదు. దీనికి ప్రధాన కారణం బీసీసీఐలో ఉన్న ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ రూల్. ఈ నిబంధన ప్రకారం భారత జట్టుకు కోచ్‌గా ఉన్న వ్యక్తి, ఐపీఎల్ టీమ్స్‌తో ఎలాంటి వ్యాపార సంబంధాలు పెట్టుకోకూడదు. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఆఫర్ తీసుకోవాలంటే, గంభీర్ తన టీమ్ ఇండియా కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
నిజానికి గంభీర్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఏ ఫ్రాంచైజీ అయినా ఆయన కోసం క్యూ కడుతుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో ఆయన పాత్ర ఏంటో అందరికీ తెలిసిందే. అందుకే రాజస్థాన్ రాయల్స్ కూడా ఆయనకు భారీ వాటా ఇచ్చి మరీ ఆహ్వానిస్తోంది. కానీ గంభీర్ ప్రస్తుతం 2027 వన్డే వరల్డ్ కప్ వరకు భారత జట్టుతో కాంట్రాక్ట్‌లో ఉన్నారు. దేశం కోసం పనిచేయడం కంటే ఐపీఎల్ ఆఫర్ పెద్దది కాదని ఆయన భావిస్తున్నారు.
న్యూజిలాండ్, శ్రీలంక సిరీస్‌లలో ఎదురుదెబ్బలు తగిలినా.. గంభీర్ మాత్రం వెనక్కి తగ్గకుండా టీమ్ ఇండియాను కొత్తగా తీర్చిదిద్దుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో ఆయన కోచ్ పదవిని వదిలేసి మళ్ళీ ఐపీఎల్ వైపు వెళ్లే ఛాన్స్ దాదాపు లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
