International Cricket Council (ఐసీసీ) మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు విడుదల చేసింది.అందరూ ఎప్పుడూ ఎప్పుడూ అని ఆశక్తిగా ఎదురుచూసే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లాండ్ మరియు వేల్స్ దేశాల్లో జరుగుతుంది.ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు అని మనకు తెలుస్తుంది వంట గది నుండి క్రికెట్ మైదానానికి చేరారు, దీనిని బట్టే చెప్పవచ్చు ఆడవాళ్ళు మీకు జోహార్లు,మొత్తం 12 జట్లు ఈసారి టైటిల్ కోసం పోటీ దిగనునాయ్.ప్రస్తుత ఛాంపియన్‌గా New Zealand women’s national cricket team బరిలోకి దిగుతుంది. కాగా ఈ టోర్నమెంట్ చరిత్రలో అత్యధికంగా ఆరు సార్లు టైటిల్ గెలుచుకున్న జట్టు Australia women’s national cricket team.
ఈసారి 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. ప్రతి జట్టు తమ గ్రూపులోని మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ ముగిసిన తర్వాత ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
గ్రూపులు ఇవి
గ్రూప్ – 1: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్
గ్రూప్ – 2: వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్
క్వాలిఫయర్ టోర్నమెంట్ ద్వారా బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్లు ఈ వరల్డ్ కప్‌కు అర్హత సాధించాయి. ముఖ్యంగా నెదర్లాండ్స్ జట్టు తొలిసారి మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఆడబోతోంది.జూన్ 30 మరియు జూలై 2 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు ది ఓవల్‌లో గ్రౌండ్ లో జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 5న లార్డ్స్ మైదానంలో నిర్వహించనున్నారు. లార్డ్స్‌ను క్రికెట్‌కు మక్కాగా కూడా పిలుస్తారు. అక్కడ ఫైనల్ జరగడం చాలా ఆకర్షణగా నిలుస్తోంది.భారత్ జట్టు గ్రూప్-1లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి బలమైన జట్లతో పోటీ పడాల్సి ఉంది. కాబట్టి ప్రతి మ్యాచ్ కీలకంగా మారనుంది. సెమీఫైనల్ చేరాలంటే గట్టి పోటీ ఇవ్వాలని అర్థం అవుతుంది.
టోర్నమెంట్ వేదికలు
ఈ 33 మ్యాచ్‌ల టోర్నమెంట్‌ను ఇంగ్లాండ్‌లోని చాలా ప్రాముఖ్యమైన క్రికెట్ మైదానాల్లో నిర్వహించనున్నారు.
ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్
ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్
హాంప్‌షైర్ బౌల్
హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్
ది ఓవల్
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్
మొత్తం మీద మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 క్రికెట్ అభిమానులకు ఒక పెద్ద ఫెస్టివల్ గా ఉండబోతోంది అని తెలుస్తుంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు ఒకే వేదికపై తలపడడం క్రీడాభిమానులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే ఈ మహా టోర్నమెంట్‌పై ఇప్పటికే చాలా ఆసక్తి పెరుగుతోంది ఇంకా అభిమానులు భారత్ ఈసారి టైటిల్ గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
