Bollywood News : ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు భామలు.. కామెంట్లు చూస్తే షాక్ అవ్వాల్సింది..!;

Bollywood News

Bollywood News

Bollywood News : ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖను ఒకే ఫ్రేమ్‌లో చూడటమే కళ్ళకు పండగ. అలాంటిది ఆమెతో పాటు బాలీవుడ్ క్వీన్ రాణి ముఖర్జీ, మన సౌత్ స్టార్ కీర్తి సురేష్ కలిస్తే? ఆ సందడే వేరు. తాజాగా ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక వేడుకలో ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు మెరిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కీర్తి సురేష్ తన సోషల్ మీడియాలో పంచుకుంటూ, గుర్తుండిపోయే సాయంత్రం (An evening to remember) అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ ఫోటోల్లో రేఖ తన ట్రేడ్‌మార్క్ తెల్లటి సల్వార్ కమీజ్, గోల్డెన్ దుపట్టాతో ఎప్పటిలాగే రాయల్ లుక్‌లో కనిపించగా, రాణి ముఖర్జీ మెరూన్ టాప్ పింక్ శాటిన్ ట్రౌజర్స్‌తో క్లాసీగా మెరిశారు. మన కీర్తి సురేష్ బ్లాక్ ప్యాంట్ సూట్‌లో పవర్ ఫుల్ లుక్‌లో అదరగొట్టింది. వీరితో పాటు నటి హుమా ఖురేషి కూడా ఈ వేడుకలో సందడి చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు “ఒకే ఫ్రేమ్‌లో ఇంతమంది లెజెండ్స్ ఆ!” అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

కీర్తి సురేష్ – విజయ్ దేవరకొండల ‘రౌడీ జనార్ధన’
కీర్తి సురేష్ వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రవికిరణ్ కోలా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో విజయ్ ఒక మాస్ అవతారంలో, మల్లేట్ హెయిర్ స్టైల్‌తో కనిపిస్తుండగా.. కీర్తి సురేష్ పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఇది కాకుండా మలయాళంలో ‘తొట్టం’ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో కూడా ఆమె నటిస్తోంది.