పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నప్పటికీ, ప్రతిపక్షం నిరసనల కారణంగా సభలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. బడ్జెట్ సమావేశాల నాలుగో రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రసంగించాల్సి ఉన్నా, నిరసనల కారణంగా అది జరగకుండా ఆగిపోయింది. అనంతరం ఆయన రాజ్యసభలో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం వచ్చింది.
ప్రతిపక్ష పార్టీలు తమ డిమాండ్లపై పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే సభను కొనసాగనివ్వమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షం సభ పనులను అడ్డుకుంటోందని ఆరోపిస్తోంది Re.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, భద్రతా కారణాల వల్ల ప్రధాని సభకు రాకుండా ఉండాలని సూచించానన్నారు. కొన్ని ప్రతిపక్ష సభ్యులు ప్రధాని సీటు దగ్గరకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం వచ్చినట్లు చెప్పారు. అయితే దీనిపై ప్రతిపక్ష నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రధానికి ఎలాంటి ప్రమాదం కలిగించే ప్రయత్నం జరగలేదని, అలాంటి ఆరోపణలు తప్పని అవి అన్ని కూడా అపోహలు అని అన్నారు.
సభలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి రావడంతో లోక్‌సభ పలుమార్లు వాయిదా పడింది. కొన్ని సందర్భాల్లో సభ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే వాయిదా వేయాల్సి వచ్చింది. అధ్యక్షుడి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం వాయిస్ ఓటుతో ఆమోదించబడినా, ప్రభుత్వ విధానాలకు సభ గ్రీన్ సిగ్నల్; ధ్వని ఓటుతో ఆమోదం పొందిన ధన్యవాద తీర్మానం. సాధారణంగా జరిగే ప్రధాని ప్రసంగం మాత్రం జరగలేదు.
బడ్జెట్ సమావేశాలు మొత్తం 65 రోజుల్లో 30 సిట్టింగ్స్‌గా జరుగుతాయి. ఫిబ్రవరి 13 నుంచి విరామం ఉండి, మార్చి 9 నుంచి మళ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ సమావేశాలు ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి.
ఇక ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కూడా సభలో చర్చ జరగాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతోంది.
మొత్తం మీద బడ్జెట్ సమావేశాలు రాజకీయ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి అనే చెప్పుకోవచ్చును. ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా, సభ పనితీరుపై ప్రభావం పడుతోంది. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి మరి.
