PM Modi’s :మోదీ మలేషియా పర్యటన : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యమా??

PM Modi’s

PM Modi’s

భారత్ – మలేషియా సంబంధాల్లో నూతన అధ్యాయం
ప్రధాని నరేంద్ర మోదీ మలేషియా పర్యటన ఇరు దేశాల మధ్య రక్షణ మరియు వాణిజ్య రంగాల్లో సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సాగుతోంది అని చెప్పవచ్చు. 2024 ఆగస్టులో ఇరు దేశాల మధ్య సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, (Comprehensive Strategic Partnership) స్థాయికి పెరిగిన తర్వాత మోదీ చేస్తున్న మొదటి పర్యటన ఇది.

భారత్ తయారు చేసిన డోర్నియర్ (Dornier) విమానాల విక్రయం, అలాగే మలేషియా వద్ద ఉన్న స్కార్పెన్ సబ్ మెరైన్లు, SU-30 యుద్ధ విమానాల నిర్వహణ (Maintenance) విషయంలో ఇరు దేశాలు కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఉంది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 19.85 బిలియన్ డాలర్లకు చేరింది. ఆసియాన్ (ASEAN) దేశాల్లో మలేషియా భారత్‌కు మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.

సాంకేతిక రంగంలో భాగంగా చిప్ తయారీ మరియు పరిశోధనల కోసం ఇరు దేశాలు ఒక భారీ ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉంది.

భారత్-మలేషియా మధ్య వాణిజ్య లావాదేవీలను భారత రూపాయి (INR) లో కూడా జరుపుకోవడానికి ఇప్పటికే అనుమతి ఉంది. ఈ పర్యటనలో డిజిటల్ చెల్లింపుల కోసం UPI మరియు మలేషియాకు చెందిన PayNet అనుసంధానంపై కూడా చర్చలు జరగనున్నాయి.

మలేషియాలో దాదాపు 29 లక్షల మంది భారతీయ సంతతి వారు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద భారతీయ ప్రవాస సమూహం. ఈ పర్యటనలో ప్రధాని మోదీ కౌలాలంపూర్‌లో సుమారు 15,000 మంది భారతీయ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

సాంస్కృతిక మరియు విద్యా సంబంధాలు
మలేషియాలోని యూనివర్సిటీ తుంకు అబ్దుల్ రహ్మాన్ (UTAR)లో ఆయుర్వేద చైర్ మరియు యూనివర్సిటీ మలయాలో తిరువళ్ళువర్ చైర్ ఇప్పటికే ఏర్పాటు చేయబడ్డాయి అని.

మలేషియాలో సుమారు 500 తమిళ పాఠశాలలు ఉన్నాయి. అక్కడ తెలుగు, పంజాబీ వంటి ఇతర భారతీయ భాషలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ పర్యటన ద్వారా ఆగ్నేయాసియా దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ముఖ్యంగా రక్షణ సామగ్రి ఎగుమతుల్లో భారత్ ఒక కీలక శక్తిగా ఎదగడానికి ఈ పర్యటన దోహదపడనుంది.

https://varthaprabhanjanam.com/student-assaulted-in-ragging-at-bengal-medical-college-west-bengal-news/