మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ‘పెద్ది’పై రామ్ చరణ్‌తో పాటు మెగా అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సానా బుచ్చిబాబు కాగా, రామ్ చరణ్‌ను పూర్తిగా ఊరమాస్ అవతార్‌లో చూపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ ఒక ఆట కూలీ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో కలిపి 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సినిమాపై అంచనాలను మరింత పెంచింది అని చెప్పుకోవచ్చును.
ఇదిలా ఉండగా, ‘పెద్ది’ షూటింగ్‌తో పాటు రామ్ చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై కూడా దృష్టి పెట్టారు.Ram Charan Upcoming Movies ఈ సినిమా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందనుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీకి ఒక పెద్ద హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు ఈ కొత్త సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
సుకుమార్ ఈ సినిమాకు రెండు కథలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఒకటి క్లాస్ కథ కాగా, మరొకటి ‘రంగస్థలం’ తరహాలో పక్కా ఊరమాస్ కథ అని తెలుస్తోంది. అయితే అభిమానులు మాస్ కథనే ఎక్కువగా ఆశిస్తున్న నేపథ్యంలో, రామ్ చరణ్ కూడా అదే కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో కూడా చరణ్ విభిన్నమైన మాస్ పాత్రలో కనిపించనున్నారని టాక్.
‘పుష్ప’, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్‌పై ఈసారి భారీ ఒత్తిడి ఉంది అని చెప్పుకోవచ్చు. అందుకే కథ, పాత్రలు, రామ్ చరణ్ లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో సెట్స్‌పైకి తీసుకెళ్లి, వచ్చే ఏడాది విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
మొత్తానికి, ‘పెద్ది’తో పాటు సుకుమార్-రామ్ చరణ్ కాంబో మూవీ మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వనుందని టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది
