క్రికెట్ ప్రియులకు టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైందనే చెప్పుకోవాలి. భారత జట్టు మాజీ సారథి రోహిత్ శర్మ టీమిండియాను వ్యూహంతో సిద్ధం చేయనున్నారు ఫిబ్రవరి 7 నుంచి భారత్ మరియు శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదని, మైదాన పరిస్థితులపై పక్కా అవగాహన ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లు జట్టు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని రోహిత్ సూచించారు.
స్పిన్ త్రయం.. ఎంపికలో సందిగ్ధత!
భారత ఉపఖండంలో జరిగే టోర్నీలలో స్పిన్నర్ల పాత్ర అత్యంత కీలకం. అయితే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వంటి మేటి స్పిన్నర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, తుది జట్టులో వారిని ఎలా సర్దుబాటు చేస్తారనేదే అసలు సమస్యని రోహిత్ అభిప్రాయపడ్డారు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే బ్యాటింగ్ లోతు తగ్గే ప్రమాదం ఉంది, అలాగని ఒకరిని పక్కన పెడితే వికెట్లు తీసే అవకాశం కోల్పోతాం” అని ఆయన విశ్లేషించారు. పిచ్ స్వభావాన్ని బట్టి రిస్క్ తీసుకోవడానికి గంభీర్ సిద్ధంగా ఉండాలని, లేనిపక్షంలో సమతుల్యం దెబ్బతింటుందని హెచ్చరించారు.
మంచు అతిపెద్ద శత్రువు!
ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో భారత మైదానాల్లో రాత్రి వేళల్లో మంచు కురవడం సర్వసాధారణం. దీనివల్ల రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే జట్టుకు బంతిపై పట్టు చిక్కదు. ముఖ్యంగా స్పిన్నర్లు తడి బంతితో ఇబ్బంది పడతారని రోహిత్ గుర్తుచేశారు. ముంబై వంటి తీర ప్రాంత నగరాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పటికీ, మంచు ప్రభావం మ్యాచ్ ఫలితాన్ని శాసించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. టాస్ గెలవడం అనేది అదృష్టమే అయినా, టాస్ ఓడిపోయినప్పుడు తడి బంతితో ఎలా నెట్టుకురావాలో బౌలర్లు ముందే సిద్ధమవ్వాలి అని రోహిత్ సూచించారు చేశారు.
రిహార్సల్స్ ముఖ్యం
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌ను కేవలం ఒక పర్యటనలా కాకుండా, ప్రపంచకప్ కోసం ప్రయోగశాలగా వాడుకోవాలని మేనేజ్‌మెంట్‌కు సూచించారు. బౌలర్లు ప్రాక్టీస్ సెషన్లలో కావాలనే బంతిని తడిపి బౌలింగ్ చేయడం వంటి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. సూర్యకుమార్ యాదవ్ తన దూకుడైన కెప్టెన్సీకి గంభీర్ మార్క్ వ్యూహాలను జోడిస్తేనే భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలుస్తుందని హిట్ మ్యాన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
