Samsung Galaxy S26: శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ధర మరియు ఫీచర్ల లీక్ .. ధర ఎంతో తెలుసా??

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ సిరీస్ గెలాక్సీ S26 (Samsung Galaxy S26) ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 25న జరగబోయే ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్’ ఈవెంట్‌లో ఈ ఫోన్లను పరిచయం చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది.అయితే, లాంచ్‌కు ముందే ఈ ఫోన్ల ధరలకు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా యూరోప్ మార్కెట్‌లో మాత్రం ధరలు ఆకాశని అంటుతున్నాయి అని తెలుస్తుంది.

నివేదికల ప్రకారం, గెలాక్సీ S25 సిరీస్‌తో పోలిస్తే S26 ధరలు ఎక్కువగా ఉండనున్నాయి:

గెలాక్సీ S26 (బేస్ మోడల్): దీని ప్రారంభ ధర EUR 999 (సుమారు రూ. 1,06,700) గా ఉండే అవకాశం ఉంది. గత ఏడాది S25 ప్రారంభ ధర EUR 959 గా ఉండేది.

గెలాక్సీ S26+: ఈ మోడల్ ధర EUR 1,269 (సుమారు రూ. 1,35,600) వరకు ఉండవచ్చు. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 10 వేల రూపాయల పెరుగుదల.

గెలాక్సీ S26 అల్ట్రా: టాప్-ఎండ్ మోడల్ అయిన అల్ట్రా 256GB వేరియంట్ ధర మాత్రం మారకపోవచ్చని తెలుస్తోంది. దీని ధర EUR 1,469 (సుమారు రూ. 1,56,900) గా ఉండొచ్చు. అయితే, 512GB మరియు 1TB మోడల్స్ ధరలు పెరిగే అవకాశం ఉంది.

ఈసారి ధరలు భారీగా పెరగనపెరగడానికి కారణం ఫోన్ తయారీకి వాడే విడిభాగాల (Components) ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా వస్తున్న Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ మరియు మెరుగైన కెమెరా సెన్సార్ల వల్ల శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈసారి బేస్ మోడల్స్‌లో 128GB వేరియంట్‌ను తొలగించి, నేరుగా 256GB నుంచే ప్రారంభించాలని శాంసంగ్ భావిస్తోంది. స్టోరేజ్ పెరగడం కూడా ధర పెరుగుదలకు ఒక కారణం.

ముఖ్యమైన ఫీచర్లు :

డిస్ప్లే: అల్ట్రా మోడల్‌లో 6.9 ఇంచుల భారీ AMOLED స్క్రీన్, 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వచ్చే అవకాశం ఉంది.

కెమెరా: అల్ట్రాలో 200MP మెయిన్ కెమెరాతో పాటు మెరుగైన జూమ్ లెన్స్‌లు కూడా ఉండనున్నాయి.

బ్యాటరీ: S26 అల్ట్రాలో 5000mAh బ్యాటరీ మరియు 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని లీక్స్ చెబుతున్నాయ.

భారతదేశంలో ఈ ఫోన్ల ధరలు ఎలా ఉంటాయనేది ఇంకా స్పష్టత లేదు, కానీ సాధారణంగా యూరోప్ ధరల ప్రభావం ఇక్కడ కూడా కొంతవరకు కనిపిస్తుంది. పూర్తి వివరాలు తెలియాలంటే ఫిబ్రవరి 25 వరకు వెయ్యి కళ్ళతో వేచి చూడాల్సిందే.