₹10,999 నుంచే స్మార్ట్ టీవీలు.. Wobble K-సిరీస్ ప్రత్యేకతలు ఇవే

Wobble Smart TV

Wobble Smart TV

భారత స్మార్ట్ టీవీ మార్కెట్‌లో దేశీయ బ్రాండ్ Wobble కొత్తగా సంచలనం సృష్టిస్తోంది. Indkal Technologies ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ బ్రాండ్ తాజాగా రెండు కొత్త స్మార్ట్ టీవీ సిరీస్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అవి K-సిరీస్ మరియు X-సిరీస్. మధ్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలో అధునాతన ఫీచర్లు అందించడమే లక్ష్యంగా ఈ టీవీలను రూపొందించారు.

2024లో భారత మార్కెట్‌లో అడుగుపెట్టిన Wobble, అతి తక్కువ సమయంలోనే వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది అని చెప్పుకోవచ్చు. వినియోగదారుల అవసరాలను గమనించి, ఈసారి రెండు వేర్వేరు సెగ్మెంట్లలో టీవీలను తీసుకొచ్చింది. సాధారణ కుటుంబాల కోసం బడ్జెట్ ధరల్లో K-సిరీస్, గేమింగ్ మరియు ప్రీమియం అనుభూతి కోరుకునే వినియోగదారుల కోసం X-సిరీస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Wobble K-సిరీస్ ఫీచర్లు

Wobble K-సిరీస్ స్మార్ట్ టీవీలు 32 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు విభిన్న స్క్రీన్ సైజ్‌లలో లభిస్తున్నాయి. కేవలం రూ.10,999 ప్రారంభ ధరతో ఇవి మార్కెట్‌లోకి రావడం విశేషం. ఈ సిరీస్‌లో Google TV 5.0, 32GB ఇంటర్నల్ స్టోరేజ్, HDMI 2.1, డ్యువల్ బ్యాండ్ Wi-Fi వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే Dolby Vision, Dolby Atmos సపోర్ట్‌తో 40W పవర్‌ఫుల్ సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తున్నాయి. స్లిమ్ ఫ్రేమ్‌లెస్ డిజైన్‌తో ఇవి రోజువారీ వినోదానికి మంచి ఎంపికగా నిలుస్తున్నాయి.

Wobble X-సిరీస్ ప్రత్యేకతలు

గేమింగ్ మరియు హైఎండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రూపొందించిన Wobble X-సిరీస్ టీవీలు రూ.23,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఇవి 43, 50, 55 అంగుళాల వేరియంట్లలో లభిస్తున్నాయి. Ultra QLED డిస్‌ప్లే, 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, HDMI 2.1, MEMC, ALLM వంటి ఫీచర్లు గేమర్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

అంతేకాదు, 80W ‘PRO’ ఆడియో సిస్టమ్, డ్యుయల్ వూఫర్లు, ప్రత్యేక యాంప్లిఫైయర్‌తో హోమ్ థియేటర్ స్థాయి ఆడియో అనుభూతిని అందిస్తాయని కంపెనీ తెలిపింది. AI ఆధారిత DynamIQ డ్యువల్ ప్రాసెసర్ వల్ల వేగవంతమైన పనితీరు లభిస్తుంది.