ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఒక విషాదకర ఘటన
ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడిని చంపిన యువతి, కేవలం ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడనే చిన్న కారణంతో, ఒక యువతి తన ప్రియుడిని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో కలకలం సృష్టించింది.
ప్రేమ నుంచి పగ వరకు దారి తీసింది
పోలీసుల కథనం ప్రకారం.. బిలాస్‌పూర్‌కు చెందిన 25 ఏళ్ల కమ్తా ప్రసాద్ సూర్యవంశీ ఒక హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తూ తన స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో ఉండేవాడు. సుమారు ఆరు నెలల క్రితం అతనికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 22 ఏళ్ల రోషిణి సూర్యవంశీ అనే యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ చాలా కాలం పాటు ఫోన్‌లో గంటలు గంటలు మాట్లాడుకుంటూ సన్నిహితంగా ఉండేవారు.
గత కొన్ని రోజులుగా కమ్తా ప్రసాద్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అతను రోషిణితో మాట్లాడటం తగ్గించడమే కాకుండా, ఆమె ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేశాడు. దీంతో రోషిణి తీవ్ర ఆగ్రహానికి గురైంది. అతను తనను దూరం పెడుతున్నాడని, బహుశా వేరే యువతితో సంబంధం పెట్టుకున్నాడేమోనని ఆమె అనుమానించింది.
మంగళవారం మధ్యాహ్నం రోషిణి తనతో పాటు ఒక కత్తిని తీసుకుని కమ్తా ప్రసాద్ ఉంటున్న ఇంటికి వెళ్ళింది. అక్కడ ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. తన నెంబర్ ఎందుకు బ్లాక్ చేశావని, నీ ఫోన్ ఒకసారి చూపించమని ఆమె డిమాండ్ చేసింది. దానికి కమ్తా నిరాకరించడంతో ఒకసారి గా తనని తాను అదుపుచేసుకోలేంత కోపం వచ్చింది ఆవేశానికి లోనైన రోషిణి, వెంట తెచ్చుకున్న కత్తితో అతని గుండెపై బలంగా పొడిచింది అచ్చం సినిమాటిక్ స్టైల్ లో లాగా.
కమ్తా కేకలు వేయడంతో గదిలో ఉన్న స్నేహితుడు బయటకు వచ్చి చూసేసరికి, అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న బిలాస్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలు రోషిణిని అరెస్ట్ చేశారు.
మృతుడు కమ్తా ప్రసాద్ స్థానిక బీజేపీ నాయకుడు, జిల్లా పంచాయతీ అధ్యక్షుడు రాజేష్ సూర్యవంశీకి మేనల్లుడని సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
