ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ (Xiaomi) భారత మార్కెట్లోకి తన సరికొత్త 17 సిరీస్ ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో సందడి చేస్తున్న ఈ ఫోన్లు, మార్చి రెండో వారంలో ఇండియాలో అడుగుపెట్టబోతున్నాయి. మొదట షియోమీ 17 షియోమీ 17 అల్ట్రా మోడల్స్ వస్తుండగా, వీటికి కొనసాగింపుగా ‘షియోమీ 17T’ (Xiaomi 17T) కూడా త్వరలోనే రాబోతున్నట్లు తాజాగా లీకులు అందుతున్నాయి.
షియోమీ 17T వచ్చే నెల చివరలో లేదా మే నెల ప్రారంభంలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8000 సిరీస్ చిప్‌సెట్‌తో పనిచేస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. దీని కంటే ముందుగా మార్చి 11న విడుదలయ్యే షియోమీ 17 అల్ట్రాలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను వాడుతున్నారు. ఇది గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ కోసం అద్భుతంగా పనిచేస్తుంది.
షియోమీ 17T మోడల్‌లో 6.67 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 5500mAh భారీ బ్యాటరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దీని ప్రో వెర్షన్ అయిన ‘షియోమీ 17T ప్రో’లో ఏకంగా 8500mAh బ్యాటరీని అమర్చబోతున్నారనే వార్త ఇప్పుడు టెక్ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్ ఛార్జింగ్ సమస్యలు అస్సలు ఉండవని యూజర్లు భావిస్తున్నారు.
గత ఏడాది విడుదలైన షియోమీ 15T సిరీస్‌తో పోలిస్తే, ఈసారి కొత్త ఫోన్లు భారీ మార్పులతో వస్తున్నాయి. ముఖ్యంగా కెమెరా క్వాలిటీ, ప్రాసెసింగ్ స్పీడ్ విషయంలో షియోమీ రాజీ పడకుండా సరికొత్త టెక్నాలజీని వాడుతోంది. ఈ 17 సిరీస్ ఫోన్లు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ధరల విషయంలో కూడా కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది.
మొత్తానికి, ప్రీమియం ఫోన్లను ఇష్టపడే వారి కోసం షియోమీ అదిరిపోయే ఫీచర్లతో ఈ కొత్త సిరీస్‌ను తీసుకొస్తోంది. మరికొద్ది రోజుల్లోనే కంపెనీ నుంచి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే సామ్‌సంగ్, ఒప్పో వంటి సంస్థలు కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తున్న తరుణంలో, షియోమీ 17 సిరీస్ మార్కెట్‌లో ఎలాంటి పోటీని ఇస్తుందో వేచి చూడాలి.
