Women’s Premier League 2026 : ఢిల్లీని చిత్తు చేసి రెండోసారి డబ్ల్యూపీఎల్ కప్ గెలిచిన ఆర్‌సీబీ…

Women's Premier League 2026

Women's Premier League 2026

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు అద్భుత విజయం సాధించింది. వడోదర వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ఆర్‌సీబీ రెండోసారి టైటిల్‌ను ముద్దాడింది. అయితే ఢిల్లీ జట్టుకు మాత్రం ఫైనల్ ఫోబియా వీడలేదు; వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించిందిగా. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (57 పరుగులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, లారా వోల్వార్డ్ట్ (44), చినెల్ హెన్రీ (35 నాటౌట్) మెరుపులు మెరిపించారు అనే చెప్పుకోవచ్చు. మహిళల క్రికెట్ ఫైనల్స్ చరిత్రలో 200 పైచిలుకు స్కోరు సాధించడం ఇదే తొలిసారి కావడంతో, ఢిల్లీ విజయం ఖాయమని అందరూ అనుకున్నారు .

204 పరుగుల కఠినమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి కెప్టెన్ స్మృతి మంధాన, జార్జియా వాల్ చారిత్రాత్మక విజయాన్ని అందించారు. మంధాన కేవలం 41 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు జార్జియా వాల్ (79) ఆమెకు అండగా నిలిచింది అనే చెప్పుకోవచ్చు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 165 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖరి ఓవర్లో రాధా యాదవ్ ఫోర్లు కొట్టి 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది.

మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ కన్నీటి పర్యంతమైంది. మా జట్టు ప్రదర్శన పట్ల నేను ఎంతో గర్వపడుతున్నాను. 204 పరుగుల స్కోరు అనేది ఫైనల్‌లో చాలా మంచి స్కోరు అని, కానీ దురదృష్టవశాత్తు మేము దాన్ని కాపాడుకోలేక పోయాము అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. యువ ఆటగాళ్లు నందిని, మిన్ను మణి ప్రదర్శనను ఆమె మెచ్చుకుంది.

విజేత (RCB): రూ. 6 కోట్ల ప్రైజ్ మనీ.
రన్నరప్ (DC): రూ. 3 కోట్ల ప్రైజ్ మనీ.
ఆరెంజ్ క్యాప్: స్మృతి మంధాన (377 పరుగులు).
పర్పుల్ క్యాప్: సోఫీ డివైన్ (17 వికెట్లు).
ఈ విజయంతో ఆర్‌సీబీ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. వరుస ఓటములతో నిరాశలో ఉన్న ఢిల్లీ అభిమానులకు జెమీమా ధైర్యం చెబుతూ, వచ్చే ఏడాది మరింత బలంగా వస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.

https://varthaprabhanjanam.com/ap-electricity-charges-to-be-reduced-soon-minister-gottipati-ravikumar-announces/