Skip to content
Thursday, Nov 05, 2026
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • Cinema
  • Life Style
  • Technology
  • Sports
  • Gallery
varthaprabhanjanam.com | Latest Telugu News Website

varthaprabhanjanam.com | Latest Telugu News Website

Advertisment Image
National

Social Media Ban: 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బంద్? బ్రెజిల్ కొత్త రూల్స్ ఇవే!

prudhviMarch 18 8:21 am
Social Media Ban

Social Media Ban

Brazil Social Media Ban: ఆస్ట్రేలియా బాటలోనే ఇప్పుడు బ్రెజిల్ కూడా పయనిస్తోంది. చిన్నారులు, కౌమార దశలో ఉన్న వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ మంగళవారం కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఇంటర్నెట్‌లో పెరుగుతున్న హింస, అసభ్యకర కంటెంట్ నుంచి పిల్లలను రక్షించడమే లక్ష్యంగా ఈ అడుగులు వేస్తోంది.

తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

కొత్త నిబంధనల ప్రకారం, 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా ఖాతా తెరవాలంటే కచ్చితంగా వారి తల్లిదండ్రుల లేదా సంరక్షకుల ఖాతాతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. కేవలం “నా వయసు 18 ఏళ్లు” అని టిక్ మార్క్ పెడితే ఇకపై కుదరదు. దీనికోసం పటిష్టమైన వయసు నిర్ధారణ పద్ధతులను కంపెనీలు పాటించాల్సి ఉంటుంది.

ఐడెంటిటీ కార్డు ఉంటేనే ఎంట్రీ!

ప్రస్తుతానికి యూజర్లు తమ గుర్తింపు కార్డులను అప్‌లోడ్ చేయడంతో పాటు, బయోమెట్రిక్ ఫోటో వెరిఫికేషన్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుందని జాతీయ డేటా రక్షణ సంస్థ డైరెక్టర్ ఇయాగే మియోలా తెలిపారు. వయసు దాచి అకౌంట్లు తెరిచే పద్ధతికి దీనివల్ల స్వస్తి పలకవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

భారీ జరిమానాలు.. అవసరమైతే నిషేధం

ఈ చట్టాన్ని ఉల్లంఘించే టెక్ సంస్థలకు బ్రెజిల్ ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది:
నిబంధనలు పాటించని కంపెనీలకు 9 మిలియన్ డాలర్ల (సుమారు 50 మిలియన్ రియల్స్) వరకు జరిమానా విధిస్తారు.
తప్పులు పునరావృతమైతే సదరు సోషల్ మీడియా యాప్‌ను దేశంలో పూర్తిగా నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
పిల్లలను ఆకర్షించే ప్రకటనలు, వీడియో గేమ్‌లలో ఉండే ‘లూట్ బాక్స్‌ల’పై కూడా నిషేధం విధించారు.

ఎందుకు ఈ నిర్ణయం

గత ఏడాది ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో చిన్నారుల లైంగిక వేధింపుల ఉదంతం బ్రెజిల్‌లో పెను సంచలనం సృష్టించింది. దాదాపు 21 కోట్ల జనాభా ఉన్న బ్రెజిల్‌లో ఇంటర్నెట్ వాడకం చాలా ఎక్కువ. వ్యసనంగా మారుతున్న అల్గారిథమ్‌ల నుంచి, సైబర్ నేరాల నుంచి భావి తరాలను కాపాడుకోవడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, మొత్తం ఇంటర్నెట్ వ్యవస్థనే నియంత్రించేలా ఈ చట్టాన్ని రూపొందించడం విశేషం. ఇప్పటికే ఆస్ట్రేలియా ఇలాంటి చట్టాన్ని తీసుకురాగా, ఇప్పుడు బ్రెజిల్ కూడా అదే దిశగా అడుగులు వేసింది. భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఆలోచనలు మొదలవ్వడం గమనార్హం.

Post Views: 73
Tagged Brazil Internet Regulations, Brazil Social Media Ban, Online Child Safety Laws, Social Media Age Verification, Under-16 Social Media Rules, Varthaprabhajanam

Post navigation

⟵ OnePlus Tablet News: భారీ డిస్‌ప్లే, సూపర్‌ ఫాస్ట్ ప్రాసెసర్‌తో వన్‌ప్లస్ కొత్త టాబ్లెట్.. ఫీచర్లు ఇవే!
Vizag Traffic Updates: విశాఖలో మరో ఫ్లైఓవర్…. భోగాపురం ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్! ⟶

Related Posts

Iran Israel War
Iran Israel War: యుద్ధం వేళ వెనక్కి తగ్గిన ఇరాన్? గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పిన మసూద్ పెజిష్కియాన్

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ…

AI Meeting Delhi
AI Meeting Delhi: ఏఐ రంగంలో ఇండియాదే హవా.. ప్రధాని మోదీ-సుందర్ పిచాయ్‌తో కీలక చర్చలు!

ఢిల్లీ వేదికగా జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్…

Iran Israel War 2026
Iran Israel War 2026 : అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులు..ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి!

మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రకంపనలు మారి మరుగుతున్నాయి.…

Latest posts

  • Ramayana Movie : బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.. ఆస్కార్ మ్యూజిక్‌తో వస్తున్న నైటెష్ తివారీ ‘రామాయణం’!
  • AP Housing Scheme: ఏపీ పేదలకు అదిరిపోయే తీపి కబురు.. టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!!
  • Stock Market: రూపాయి భారీ పతనం: డాలర్‌తో పోలిస్తే రూ. 95 మార్కు దాటిన విలువ.. ఆందోళనలో ఇన్వెస్టర్లు!
  • April 1 New Rules: బ్యాంకింగ్ అలర్ట్..‌ రేపటి నుంచే కొత్త బ్యాంకింగ్ నియమాలు..కస్టమర్లు ఇవి తెలుసుకోవాల్సిందే..!!
  • Hyderabad CNG Shortage: హైదరాబాద్‌లో సీఎన్‌జీ సెగ: 2 కిలోమీటర్ల మేర బారులు తీరిన ఆటోలు!
  • AP Govt E-Bicycle Scheme: ఏపీలో సబ్సిడీతో ఈ-సైకిళ్ల పంపిణీ.. స్కీమ్ పూర్తి వివరాలు ఇవే!
  • North Korea Flights: ఉత్తర కొరియా కీలక నిర్ణయం..గగనతల ఆంక్షలు ఎత్తివేత.. చైనా విమానానికి గ్రాండ్ వెల్కమ్..!
  • IPL Updates: సూర్య ఫిట్‌నెస్‌పై ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.
  • Middle East Conflict 2026: గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతే మా బాధ్యత.. పాలక్కాడ్ సభలో ప్రధాని మోదీ కీలక ప్రకటన..!
  • Tax Saving Tips: మార్చి 31 డెడ్‌లైన్.. ఈ పనులు పూర్తి చేయకపోతే భారీగా పన్ను కట్టాల్సిందే!
About us

Welcome to Varthaprabhanjanam your trusted source for rapid and reliable Telugu news. We deliver real-time updates on politics, cinema, sports, and technology. Our mission is to provide accurate, unbiased reporting that keeps the global Telugu community connected and informed every single day.

Most Viewed Posts
  1. Dhurandhar 2 Day 7 Collection : బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ కాసుల వర్షం.. వారం రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లో ‘ధురంధర్ 2’
  2. ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్: రూ. 17,000 విలువైన ఫ్రీ ఏఐ సర్వీస్ నిలిపివేత!
  3. Indian Army Operation : పాక్ ఉగ్రవాదులకు పాతాళంలోనూ చావు తప్పలేదు
  4. AP Budget 2026 : ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం – లోటు, వ్యయం వివరాలు ఇవే
  5. Critical Minerals : ​చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం…భారత్-అమెరికా బంధంలో సరికొత్త శకం!!
All copyrights by varthaprabhanjanam.com @2026 | Rapid News by Ascendoor | Powered by WordPress.