డ్రగ్స్ మాఫియాపై భారత్-అమెరికా ఉమ్మడి దాడి: ఆపరేషన్ మెల్ట్‌డౌన్ సక్సెస్
అమెరికాలో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక పెద్ద నెట్‌వర్క్‌ను అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ (DEA) భారత్ సహాయంతో ఛేదించింది. ఆపరేషన్ మెల్ట్‌డౌన్ పేరుతో జరిగిన ఈ భారీ ఆపరేషన్‌లో భాగంగా, భారత్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ నేరగాళ్ల ముఠాకు చెందిన 200 వెబ్సైట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా ఇంటర్నెట్లో నకిలీ ఫార్మసీ వెబ్సైట్లను నడుపుతూ అమెరికన్లకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రమాదకరమైన మందులను అమ్ముతోంది. ఈ వెబ్సైట్లు చూడటానికి అసలైన మందుల దుకాణాల్లాగే కనిపిస్తాయి. కానీ, వీటి ద్వారా సరఫరా అవుతున్న డ్రగ్స్ వల్ల అమెరికాలో ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
అరెస్టులు: అమెరికాలో ఈ ముఠాకు సహకరిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వెబ్సైట్ల మూసివేత: డ్రగ్స్ అమ్మేందుకు వాడుతున్న 200 వెబ్సైట్లను అధికారులు బ్లాక్ చేశారు.
ఫెంటానిల్ ప్రమాదం: ఈ ముఠా సరఫరా చేస్తున్న మందుల్లో ప్రాణాంతకమైన ఫెంటానిల్ మరియు మెథాంఫేటమైన్ వీటిని సెడెటివ్ మెడిసిన్ గా పోస్ట్ ఆపరేటివ్ టైం లో డాక్టర్స్ రాసి ఇస్తారు ఆది కూడా డబుల్ లాక్, డబుల్ చెక్ పద్ధతిలో, కానీ బయట ఈ డ్రగ్ మాఫీయా వీటిని వాడడం వల్ల చాలా మందికి ప్రాణ నష్టం జరుగుతుంది.
దర్యాప్తు: 2022 నుండి DEA ఈ ముఠాపై నిఘా ఉంచింది. ఈ క్రమంలో దాదాపు 20,000 మంది కస్టమర్లకు అధికారులు లేఖలు పంపి సమాచారం సేకరిస్తున్నారు.
భారత్ సహకారంపై అమెరికా ప్రశంసలు:
అమెరికా అధ్యక్షుడి ప్రభుత్వం డ్రగ్స్‌ను అరికట్టడాన్ని ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం మరియు భారత పోలీసు వ్యవస్థ అందిస్తున్న సహకారం అమోఘమని DEA అడ్మినిస్ట్రేటర్ టెరెన్స్ కోల్ కొనియాడారు. ఇతర దేశాలతో పోలిస్తే, భారత్ ఈ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంలో అమెరికాతో చేతులు కలిపి పనిచేస్తోందని వారు పేర్కొన్నారు.
నకిలీ వెబ్సైట్ల ద్వారా మందులు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, కేవలం డాక్టర్ సలహా మేరకే గుర్తింపు పొందిన ఫార్మసీల నుంచి మందులు తీసుకోవాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.
