Nani Paradise Movie : ప్యారడైజ్ మూవీ సాంగ్ వివాదం.. నేచురల్ స్టార్ సినిమాపై యూట్యూబర్ సంచలన వ్యాఖ్యలు.

Nani Paradise Movie

Nani Paradise Movie

అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైన నేచురల్ స్టార్ నాని జీవితం అష్టా చమ్మ హీరో నుండి నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు. ఒకవైపు నిర్మాతగా ‘కోర్ట్’ సినిమాతో సక్సెస్ అందుకున్న నాని, మరోవైపు హీరోగా ‘ప్యారడైజ్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి నాని చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘ఆయా షేర్’ అనే పాటను విడుదల చేశారు. అనిరుధ్ అందించిన మ్యూజిక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఈ సంతోషం మధ్యలో ఒక కొత్త వివాదం మొదలైంది. ఈ పాటలో నాని వేసిన హుక్ స్టెప్ కాపీ కొట్టారంటూ నెట్టింట చర్చ జరుగుతోంది. బాబా జాక్సన్ అనే పేరుతో ఫేమస్ అయిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, ఈ స్టెప్ తనదేనని క్లెయిమ్ చేస్తున్నాడు. గతంలో తాను ఒక విదేశీయుడితో కలిసి చేసిన డ్యాన్స్ మూమెంట్స్ నే ఇప్పుడు నాని సినిమాలో వాడుకున్నారని అతను ఆరోపిస్తున్నాడు. దీంతో నెటిజన్లు ఆ రెండు వీడియోలను పక్కపక్కన పెట్టి మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

నిజానికి నాని డ్యాన్స్ అంటే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ ‘ఆయా షేర్’ సాంగ్‌లో కూడా నాని తన స్టైలిష్ మూమెంట్స్‌తో అదరగొట్టాడు. పాట విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉంది. కానీ ఈ కాపీ ఆరోపణలు ఇప్పుడు సినిమా యూనిట్‌కు కొంత తలనొప్పిగా మారాయి. మరీ ముఖ్యంగా అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చిన సినిమాల్లో డ్యాన్స్ స్టెప్పులు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి, అలాంటిది ఇప్పుడు కాపీ వివాదం రావడం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వివాదంపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. సాధారణంగా ఇండస్ట్రీలో ఇలాంటి స్టెప్పులు అప్పుడప్పుడు సిమిలర్‌గా ఉండటం సహజమని కొందరు నాని ఫ్యాన్స్ సర్దిచెబుతున్నారు. ఏదేమైనా ‘ప్యారడైజ్’ సినిమా ప్రమోషన్ల విషయంలో ఈ చిన్న రచ్చ సినిమాకు మరింత పబ్లిసిటీ తెచ్చిపెడుతోంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో, ఇలాంటి రూమర్లు సినిమా రిజల్ట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.