టాలీవుడ్ మోస్ట్ క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ రష్మిక మందనల పెళ్లి గురించి గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. వెండితెరపై ‘గీత గోవిందం’గా అలరించి, ‘డియర్ కామ్రేడ్’తో మనసులను హత్తుకున్న ఈ క్యూట్ కపుల్, ఇప్పుడు నిజ జీవితంలోనూ వివాహ బంధంతో ఒకటయ్యారు. తమ ప్రేమకు అధికారిక ముద్ర వేస్తూ, నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
వీరిద్దరి పరిచయం ‘గీత గోవిందం’ సినిమా సెట్స్‌లో మొదలైంది. ఆ చిత్రంలో వీరి మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా, వీరి మధ్య బలమైన స్నేహానికి పునాది వేసింది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో ఆ స్నేహం మరింత గాఢమై, క్రమంగా అది వీర ప్రేమగా మారింది. తరచూ విదేశీ ప్రయాణాల్లోనూ, సోషల్ మీడియా వేదికల పైన కలిసి కనిపిస్తూ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచిన ఈ జంట, ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు టాలీవుడ్‌లోని ప్రముఖుల సమక్షంలో ఈ వివాహ వేడుక అత్యంత కన్నుల పండుగగా రంగ రంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా #ViRash అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. తమకు ఇష్టమైన జంట పెళ్లి పీటలు ఎక్కడం చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ ‘క్యూట్ కపుల్’కు సినీ ప్రపంచం నుండి నెటిజన్ల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వీరి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగిపోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
