టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి తర్వాతి వేడుకలు అంబరాన్నంటాయి. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట, తాజాగా హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు మెరిసిపోవడంతో ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ రిసెప్షన్ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ‘పుష్ప’ టీమ్ రీ యూనియన్. రష్మిక మందన్న రిసెప్షన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పుష్ప సినిమాలో భార్యాభర్తలుగా నటించిన వీరిద్దరూ ఇలా నిజ జీవిత వేడుకలో కలవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. బన్నీతో పాటు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నాగార్జున, నాని వంటి అగ్ర హీరోలు ఈ వేడుకకు విచ్చేసి సందడి చేశారు.
తమ పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ విజయ్ దేవరకొండ ఒక ఎమోషనల్ నోట్ రాశారు. “నాకు ఒక తోడు కావాలనిపించిన ప్రతి నిమిషం తనే గుర్తొచ్చేది. నా బెస్ట్ ఫ్రెండ్‌ను నా భార్యగా మార్చుకున్నాను అంటూ తన ప్రేమను చాటుకున్నారు. రష్మిక కూడా విజయ్ తన జీవితంలోకి వచ్చాక ప్రశాంతత అంటే ఏంటో తెలిసిందని, తన కలలను గౌరవించే వ్యక్తి దొరకడం తన అదృష్టమని పేర్కొన్నారు.
వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఈ జంట, పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సెలవు తీసుకుని ‘అండర్‌గ్రౌండ్’ లోకి వెళ్తామని సరదాగా వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రాబోతున్న ‘రణబలి’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించనున్నారు. ప్రస్తుతం ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
