ముంబై నగరంలో ( Mumbai breaking news)అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీపావళి రోజు పటాసుల మోత ఎలా వస్తుందో అల జుహూ ప్రాంతంలో ఉన్న ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు Rohit Shetty నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో హై సెక్యూరిటీ జోన్‌గా పేరున్న జుహూ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచింది.
కాల్పులు జరిగిన సమయంలో రోహిత్ షెట్టి ఇంట్లో ఉన్నారా లేదా అనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన వ్యక్తులు వెంటనే అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఈ సంఘటనతో బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. రోహిత్ షెట్టి ఇంటి చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు. జుహూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కాల్పుల వెనుక కారణాలు ఏమిటి? దీనికి పాల్పడినవారు ఎవరు? అనే అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు .
ముంబై పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సంఘటన స్థలానికి ఫోరెన్సిక్ టీమ్‌ను కూడా పంపించామని, కాల్పులకు ఉపయోగించిన ఆయుధం ఏ రకమైనదో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. అలాగే పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుల కదలికలను గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు.
గోల్మాల్, సింగమ్, సింబా వంటి హిట్ సినిమాలతో గుర్తింపు పొందిన రోహిత్ షెట్టి ఇంటి వద్ద ఈ తరహా ఘటన జరగడం ముంబై నగర భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు
