Ramayana Movie : బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.. ఆస్కార్ మ్యూజిక్‌తో వస్తున్న నైటెష్ తివారీ ‘రామాయణం’!

Ramayana Movie

Ramayana Movie

Ramayana Movie : బాలీవుడ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ పార్ట్-1 గురించి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. నైటెష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా తాలూకు ఫస్ట్  గ్లింప్స్‌ను ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఒక స్పెషల్ ఈవెంట్‌లో ప్రదర్శించారు. ఈ వేడుకకు హీరో రణబీర్ కపూర్, నిర్మాత నమిత్ మల్హోత్రా హాజరయ్యారు. అక్కడ సినిమా చూసిన వారి నుంచి వస్తున్న రివ్యూలు చూస్తుంటే, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.

కళ్లు చెదిరే విజువల్స్ – గగుర్పొడిచే ఎమోషన్స్

ఈ స్పెషల్ షో చూసిన ఒక నెటిజన్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ఈ సినిమాలోని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని పొగిడేశారు. ముఖ్యంగా రాముడిగా రణబీర్ కపూర్ ఎంట్రీ ఇచ్చే సీన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉందట. ఒక పడవలో కూర్చున్న రాముడు, తన పేరు పిలవగానే నెమ్మదిగా వెనక్కి తిరిగే సన్నివేశం చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయని ఆ ప్రేక్షకురాలు చెప్పుకొచ్చారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో మన సంస్కృతికి సంబంధించిన ఎమోషన్స్ కూడా చాలా లోతుగా ఉన్నాయని రివ్యూలు వస్తున్నాయి.

రాముడి పాత్రపై రణబీర్ మాటలు

ఈవెంట్ సందర్భంగా రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్ర గురించి చాలా గొప్పగా మాట్లాడారు. “శ్రీరాముడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, కోట్ల మంది ప్రజల అంతరాత్మ. కష్ట సమయాల్లో మనిషి ఎలా ధైర్యంగా నిలబడాలి, ఇతరుల పట్ల ఎలా దయ చూపాలి అనే విషయాలకు ఆయన ఒక నిదర్శనం. అందుకే ఆయన్ని మర్యాద పురుషోత్తముడు అంటారు. అటువంటి గొప్ప పాత్రలో నటించడం నా అదృష్టం” అని రణబీర్ పేర్కొన్నారు. అక్కడ ఉన్నవారందరినీ రణబీర్ ‘జై సీయారామ్’ అంటూ పలకరించడం అందరి మనసు గెలుచుకుంది.

భారీ తారాగణం.. దిగ్గజ సాంకేతిక నిపుణులు

నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో రవి దూబే కనిపిస్తున్నారు. వీటన్నింటికీ మించి, ఈ సినిమాకు ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ హాన్జ్ జిమ్మెర్ కలిసి సంగీతం అందిస్తుండటం విశేషం. హాలీవుడ్ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయని, ముఖ్యంగా ఐమాక్స్ త్రీడీ ఫార్మాట్‌లలో ఈ సినిమా అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

ట్రైలర్ ఎప్పుడు? విడుదల ఎప్పుడు?

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ (ట్రైలర్) ఏప్రిల్ 2, 2026న అధికారికంగా విడుదల కానుంది. హనుమాన్ జయంతి సందర్భంగా రాముడి లుక్‌ను రివీల్ చేయబోతున్నారు. ఇక సినిమా విషయానికొస్తే, ‘రామాయణ పార్ట్-1’ 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మొత్తం మీద ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.