Airtel Digital TV offers : ఎయిర్‌టెల్ యూజర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్: మొబైల్, బ్రాడ్‌బ్యాండ్, DTH కస్టమర్లకు Adobe Express ఉచితం

Airtel Digital TV offers

Airtel Digital TV offers

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్: 36 కోట్ల మంది వినియోగదారులకు ‘అడోబ్ ఎక్స్‌ప్రెస్’ ఉచితం ఎలా అనుకుంటున్నారా,ప్రముఖ టెలికాం సంస్థ
భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం సరికొత్త సంవత్సరం కానుకను ప్రకటించింది. దాదాపు రూ. 4,000 విలువైన ‘అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం’ (Adobe Express Premium) సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందచేయనుంది. గతంలో పెర్ప్లెక్సిటీ AI ఆఫర్‌ను అందించిన ఎయిర్‌టెల్, ఇప్పుడు కంటెంట్ క్రియేటర్లు, విద్యార్థులు మరియు చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈ అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఎవరెవరు అర్హులు?
ఎయిర్‌టెల్ తన 36 కోట్ల మంది వినియోగదారులందరికీ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.
మొబైల్ వినియోగదారులు: ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల వారు.

బ్రాడ్‌బ్యాండ్: ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ (Wi-Fi) యూజర్లు.
DTH: ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కస్టమర్లు.
అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం వల్ల ప్రయోజనాలు:
సాధారణంగా ఈ సర్వీస్ కోసం నెలకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఆఫర్ ద్వారా

మీరు పొందే ప్రయోజనాలు ఇవే:
AI టూల్స్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఫోటో బ్యాక్‌గ్రౌండ్ తొలగించడం, ఇమేజ్ జనరేషన్ వంటివి సులభంగా చేయవచ్చు.
విడియో ఎడిటింగ్: వాటర్ మార్క్ లేకుండా ప్రొఫెషనల్ రీల్స్, షార్ట్ వీడియోలను కూడా క్రియేట్ చేయవచ్చు.

భారీ స్టోరేజ్: మీ ప్రాజెక్టులను సేవ్ చేసుకోవడానికి 100GB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది.
ప్రీమియం కంటెంట్: 30,000కు పైగా ఫాంట్లు, కోట్లాది అడోబ్ స్టాక్ ఫోటోలు మరియు వీడియో టెంప్లేట్లు అందుబాటులో ఉంటాయి.

ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేయడం ఎలా?
ఈ ఆఫర్‌ను పొందడానికి మీకు ఎటువంటి క్రెడిట్ కార్డ్ వివరాలు అవసరం లేదు. కేవలం ఎయిర్‌టెల్ థాంక్స్ (Airtel Thanks) యాప్ ఉంటే మాత్రం సరిపోతుంది:
మీ ఫోన్‌లో ‘Airtel Thanks App’ ఓపెన్ చేయండి. పైన కనిపించే మెనూ బటన్ లేదా ‘Rewards & OTT’ సెక్షన్ లోకి వెళ్లండి.
అక్కడ మీకు ‘Adobe Express Premium’ బ్యానర్ కనిపిస్తుంది.

Claim Now పై క్లిక్ చేసి, మీ అడోబ్ అకౌంట్‌తో లాగిన్ అవ్వండి (లేదా కొత్త అకౌంట్ క్రియేట్ చేయండి).
వెంటనే మీ 12 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ యాక్టివేట్ అవుతుంది.

ఈ ఆఫర్ రిడీమ్ చేసుకున్న రోజు నుండి ఏడాది పాటు మాత్రమే ఉచితంగా ఉంటుంది. ఆ తర్వాత సర్వీస్ కొనసాగించాలంటే చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

https://varthaprabhanjanam.com/telangana-phone-tapping-case-kcr-sit/