Vegetarian Protein : సప్లిమెంట్స్ వద్దు.. ఖర్చు వద్దు: ఇంట్లోనే 100 గ్రాముల వెజ్ ప్రోటీన్!

Vegetarian Protein

Vegetarian Protein

శాకాహారులకు శుభవార్త: సప్లిమెంట్స్ లేకుండానే రోజుకు 100 గ్రాముల ప్రోటీన్!
చాలామందికి ఒక అపోహ ఉంటుంది – బాడీ బిల్డింగ్ చేయాలన్నా లేదా కండరాలు దృఢంగా ఉండాలన్నా కేవలం మాంశాకాహారులకుసాహారం లేదా ప్రోటీన్ పౌడర్లు (Supplements) మాత్రమే వాడాలని. కానీ, మన భారతీయ వంటగదిలో లభించే సాధారణ ఆహార పదార్థాలతోనే రోజుకు 100 గ్రాముల ప్రోటీన్‌ను సులభంగా పొందవచ్చు.

ఖరీదైన ఫుడ్స్ అవసరం లేదు
మనం రోజూ తినే పప్పులు, పనీర్, సోయా వంటి పదార్థాలను సరైన మోతాదులో, సరైన సమయంలో తీసుకుంటే ప్రోటీన్ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. దీని కోసం ఖరీదైన విదేశీ సూపర్ ఫుడ్స్ అవసరం లేదని, కేవలం రోజుకు రూ. 220 ఖర్చుతోనే ఈ డైట్ ప్లాన్ పాటించవచ్చు.

ఒక రోజు ప్రోటీన్ డైట్ ప్లాన్ ఇలా..ఉదయం నుండి రాత్రి వరకు ఆహారాన్ని ఇలావిభజించుకోవచ్చు:ఉదయం (Pre-Breakfast): రోజును నానబెట్టిన లేదా వేయించిన అవిసె గింజలు (Flaxseeds) లేదా గుమ్మడి గింజలతో ప్రారంభించండి. ఇవి మీకు 2 గ్రాముల ప్రోటీన్‌తో పాటు మంచి కొవ్వులను అందిస్తాయి.

అల్పాహారం (Breakfast): పనీర్ శాండ్‌విచ్ మరియు గ్రీక్ యోగర్ట్ (పెరుగు) తీసుకోవడం ద్వారా దాదాపు 15 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. పనీర్‌కు బదులుగా టోఫును కూడా వాడుకోవచ్చు.

మధ్యాహ్నం (Lunch): ఇది రోజులో అత్యంత కీలకమైన భోజనం. గోధుమ రోటీలు, సోయా చంక్స్ మసాలా కూర, మూంగ్ దాల్ (పెసరపప్పు) మరియు కూరగాయలు తీసుకోవాలి. దీని ద్వారా ఏకంగా 41 గ్రముల ప్రోటీన్ అందుతుంది.

సాయంత్రం స్నాక్స్: వేయించిన మఖానా (తామర గింజలు), టోఫు ముక్కలు మరియు అల్లం టీ తీసుకోవడం వల్ల 13 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.

రాత్రి భోజనం (Dinner): రాత్రిపూట తేలికగా ఉండే శనగపిండి చిల్లా (Besan Chilla) లేదా పెసరట్టు, పెరుగుతో కలిపి తీసుకుంటే మరో 26 గ్రాముల ప్రోటీన్ మీ సొంతమవుతుంది.

ఈ ప్లాన్ ద్వారా మొత్తం 103 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. ఇది కేవలం బాడీ బిల్డర్లకే కాకుండా, బరువు తగ్గాలనుకునే వారికి మరియు ఆరోగ్యంగా ఉండాలనుకునే శాకాహారులందరికీ ఎంతో ఉపయోగకరం. కాని హై-ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగకుండా ఉండటానికి తగినంత నీరు తీసుకోవాలి జీవనశైలిలో మార్పు ప్రోటీన్ లోపం రాకుండా ఉండాలంటే ఇలాంటి దేశీ ఆహారపు అలవాట్లను పాటించడం ఉత్తమం.

https://varthaprabhanjanam.com/apple-iphone-flip-rumors-clamshell-design-to-launch-after-iphone-fold-in-2026/