జగ్గయ్యపేట మండలం, మల్కాపురం గ్రామానికి చెందిన చింతకాయల జయమ్మ అనే దివ్యాంగురాలు నడవడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఘనపనేని పిచ్చయ్య చౌదరి గారి దృష్టికి రావడంతో, ఆయన తక్షణ స్పందించి రూ.18,000/- విలువగల వీల్ చైర్‌ను స్వయంగా స్పాన్సర్ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ వీల్ చైర్‌ను ఈ రోజు జగ్గయ్యపేట పట్టణంలోని శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారి నివాసంలో, వారి చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య గారు మాట్లాడుతూ
దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం మరియు పార్టీ కృషి చేస్తోందని, ప్రతి అవసరమున్న కుటుంబానికి అండగా నిలబడటం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఘనపనేని పిచ్చయ్య చౌదరి, కసుకుర్తి శ్రీనివాసరావు, నకిరకంటి వెంకట్, కర్ల జోజి, జగ్గయ్యపేట నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షుడు వడ్డేపూడి ఉమామహేశ్వరావు, మారేపల్లి శౌరి, అన్నెపాక దుర్గామహేశ్వర రావు, బొబ్బిళ్ళపాటి ప్రసాద్, బొడ్డు వెంకటేశ్వరరావు, వేల్పుల జ్ఞానరత్నం, నాగయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
