హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్నట్లు అధికారులు ప్రకటన చేశారు. మరమ్మతులు మరియు నిర్వహణ పనుల కారణంగా నేడు (ఫిబ్రవరి 3, 2026) నగరం అంతటా కూడా వేర్వేరు సమయాల్లో పవర్ కట్ అవుతుంది.
ప్రాంతాల వారీగా విద్యుత్ కోతలు:
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ – ఉదయం 10:00 – మధ్యాహ్నం 1:00 ఎస్వీఎస్ టెంపుల్ ఫీడర్ పరిసరాలు.
మధ్యాహ్నం 2:00 – సాయంత్రం 5:00 ,నవభారత్ చాంబర్స్, హైదరాబాద్ సెంట్రల్, బంజారా నగర్.
సైఫాబాద్ ఏడీఈ – ఉదయం 10:00 – మధ్యాహ్నం 1:00 దిల్కుషా గెస్ట్‌హౌస్, గోశాల, హిమాయత్ నగర్ బ్రాండ్ ఫ్యాక్టరీ, లోకాయుక్త పరిసరాలు.
మధ్యాహ్నం 2:00 – సాయంత్రం 5:00 – కత్రియా హోటల్, సత్యం కంప్యూటర్స్, తాళ్లబస్తీ, భారతీయ విద్యా భవన్.
సైదాబాద్/ఆస్మాన్‌ఘడ్, ఉదయం 10:00 – సాయంత్రం 5:00 – శాలివాహన నగర్ పరిసరాలు.
మధ్యాహ్నం 2:00 – సాయంత్రం 5:00
ద్వారకాపురం, గౌతంనగర్.
ఉదయం 10:00 – మధ్యాహ్నం 1:00
దిల్సుఖ్నగర్, సీ క్వార్టర్ ఫీడర్ ప్రాంతాలు.
సంతోష్ నగర్ ఉదయం 10:00 – మధ్యాహ్నం 1:00 క్రాంతినగర్, కల్వంచ, మదర్ డైరీ.
ఉదయం 11:00 – సాయంత్రం 5:00 ఆల్ ఇండియా రేడియో, హైకోర్ట్ కాలనీ.
మధ్యాహ్నం 2:00 – సాయంత్రం 5:00 భగత్ సింగ్ నగర్, ప్యారడైజ్ విల్లాస్, ఆంధ్రకేసరి కాలనీ.
ఉప్పల్ ఉదయం 10:30 – మధ్యాహ్నం 1:30 లక్ష్మారెడ్డి కాలనీ, రాఘవేంద్ర కాలనీ, సూర్యానగర్, సరస్వతీ కాలనీ.
మధ్యాహ్నం 3:00 – సాయంత్రం 5:30 దేవేందర్ నగర్, లక్ష్మీనారాయణ కాలనీ, వకీల్ బిల్డింగ్ లైన్.
బోడుప్పల్ మధ్యాహ్నం 2:00 – సాయంత్రం 5:00 ద్వారకానగర్ (ఫేజ్ 1, 2), కేశవనగర్, గాయత్రీ నగర్, ఆంజనేయనగర్.
ఈ విద్యుత్ అంతరాయం ప్రధానంగా లైన్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు మరియు సమ్మర్ సీజన్ కోసం ముందస్తు జాగ్రత్త పనుల వల్ల జరుగుతోంది. పనులు త్వరగా పూర్తయితే నిర్ణీత సమయం కంటే ముందే సరఫరా పునరుద్ధరించబడే అవకాశం ఉంది.
మీరు చేయవలసినవి:
ముఖ్యమైన ఎలక్ట్రానిక్ పరికరాలను ముందుగానే ఛార్జ్ చేసుకోండి ఉద్యోగులకు ఏవీ చాల ముఖ్యం.
నీటి మోటార్లను ఉదయం 10 గంటల లోపు వేసుకోవడం మంచిది.
అత్యవసర పనులను విద్యుత్ ఉన్న సమయానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి.
మీ ఏరియాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీరు TGSPDCL అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌ను తనిఖీ చేయవచ్చు.
