క్రికెట్ అంటే మంచి కిక్ వచ్చే కాంబినేషన్ అంటే మాత్రం పాకిస్తాన్ మరియు ఇండియా ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్నభారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌తో తలపడబోమని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించడం సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌ను పాక్ బహిష్కరించడం వల్ల సుమారు రూ. 2200 కోట్ల (250 మిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ మ్యాచ్ రద్దు కావడం వల్ల కేవలం ఐసీసీకే కాకుండా బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లు కూడా భారీగా నష్టపోనున్నారు.
ప్రసారకర్తలు: బ్రాడ్‌కాస్టర్ స్టార్ గ్రూప్ కేవలం యాడ్స్ రూపంలోనే రూ. 250 కోట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ మ్యాచ్ సమయంలో 10 సెకన్ల ప్రకటన రేటు సుమారు రూ. 40 లక్షల వరకు పలుకుతుంది. క్రికెట్ బోర్డులు: మ్యాచ్ రద్దు వల్ల బీసీసీఐ, పీసీబీలకు తలా రూ. 200 కోట్ల వరకు నష్టం కలగవచ్చు అని.
పీసీబీకి గట్టి దెబ్బ: బీసీసీఐకి ఈ నష్టం చిన్నదే కావొచ్చు కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (PCB) కి మాత్రం ఇది భారీ దెబ్బ అని తెలుస్తుంది. ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయం (రూ. 325 కోట్లు) నిలిచిపోయే ప్రమాదంతో పాటు, నిబంధనల ఉల్లంఘన కింద ఐసీసీ జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది అని తెలుస్తుంది.
భద్రతా కారణాల రీత్యా బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని కోరగా, ఐసీసీ నిరాకరించింది. దీనికి నిరసనగా బంగ్లాదేశ్ టోర్నీ నుండి తప్పుకోగా, వారికి మద్దతుగా పాక్ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్ ఆడబోమని నిర్ణయించింది.
ఒకవేళ పాక్ ఈ మ్యాచ్ ఆడకపోతే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్‌కు నేరుగా రెండు పాయింట్లు లభిస్తాయి. అంతేకాకుండా, పాకిస్థాన్ రన్ రేట్‌పై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానులు ఐసీసీ తీసుకోబోయే తదుపరి నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
https://varthaprabhanjanam.com/hyderabad-power-cut-today-full-list-of-affected-areas-and-ti
