Dhurandhar 2: మార్చి 19న ‘ధురంధర్ ది రివెంజ్’ విధ్వంసం.. ధురంధర్’ సీక్వెల్ నెట్‌ఫ్లిక్స్‌లో రావడం లేదు.. మరి ఎక్కడంటే?

Dhurandhar 2

Dhurandhar 2

బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘ధురంధర్’ సీక్వెల్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్స్ వచ్చేశాయి. ఈ సినిమా సెకండ్ పార్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రణవీర్ సింగ్ గంభీరమైన లుక్‌లో కనిపిస్తున్నారు. భారీ వర్షంలో, ఒళ్లంతా రక్తంతో తడిసిపోయి, శత్రువుల కోసం తీక్షణంగా చూస్తున్న రణవీర్ లుక్ ‘రివెంజ్’ పీక్స్‌లో ఉంటుందని స్పష్టం చేస్తోంది.

పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రణవీర్ సింగ్, “అబ్ బిగడ్నే కా వక్త్ ఆ గయా హై” (ఇక విధ్వంసం మొదలయ్యే సమయం వచ్చింది) అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మొదటి భాగంలో పాకిస్థాన్‌లో అండర్ కవర్ ఏజెంట్‌గా హంజా అలి మజారీ (జస్కీరత్ సింగ్ రంగీ) చేసిన ఆపరేషన్ ఒక ఎత్తు అయితే, ఈ రెండో భాగంలో శత్రువులపై అతడు తీర్చుకోబోయే ప్రతికారం మరో స్థాయిలో ఉంటుందని ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది.

టీజర్ లాంచ్.. టైమ్ ఫిక్స్!

ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 3వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం 12:12 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రకటించినట్లు గానే విడుదల చేయగా ఆ వేశాలన్నీ పార్ట్ సన్నివేశాలు ఎక్కువ ఎక్కువగా చూపించారు. సినిమాపై ఆసక్తి పెంచేలా టీజర్ ను విడుదల చేశారు. సోమవారం సాయంత్రం రణవీర్ సింగ్ మరియు ఆదిత్య ధర్ ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక చిన్న స్టోరీతోనే ఫ్యాన్స్‌లో భారీ క్యూరియాసిటీ నెలకొంది. ఈ సీక్వెల్‌లో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ధురంధర్ మొదటి భాగం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అయితే, ‘ధురంధర్ 2’ ఓటీటీ హక్కులను మాత్రం ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ ‘జియో హాట్ స్టార్’ (JioHotstar) దక్కించుకుంది. పోస్టర్ కింద ఎడమ వైపున ఈ లోగో కనిపించడంతో ఈ మార్పు స్పష్టమైంది. అలాగే మ్యూజిక్ రైట్స్ కూడా సారెగమ నుంచి టీ-సిరీస్‌కు మారినట్లు సమాచారం.

పాన్ ఇండియా రిలీజ్ ఎప్పుడంటే?

ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మొదటి భాగం రికార్డులను ఈ సీక్వెల్ బ్రేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.