Sanjay Kumar MLA​ : బిఆర్ఎస్‌కు మరో షాక్.. సంజయ్ కుమార్ అనర్హత వేటుపై స్పీకర్ కీలక తీర్పు.

Sanjay Kumar MLA ​

Sanjay Kumar MLA ​

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌కు పార్టీ ఫిరాయింపుల కేసులో భారీ ఊరట లభించింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ బుధవారం కొట్టివేశారు. సంజయ్‌ కుమార్‌ పార్టీ మారినట్లు ధ్రువీకరించే సరైన ఆధారాలు లేవని స్పీకర్ తన తీర్పులో స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరపున గెలిచిన సంజయ్‌ కుమార్‌, ఆ తర్వాత అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరారని బీఆర్‌ఎస్‌ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన స్పీకర్, బుధవారం తన నిర్ణయాన్ని వేలాడి చేశారు. సంజయ్‌ కుమార్‌ అధికారికంగా కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నట్లు గానీ లేదా ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు బలమైన సాక్ష్యాధారాలు మరియు ఫిర్యాదుదారులుకూడా
సమర్పించలేకపోయారని స్పీకర్ పేర్కొన్నారు ఇది కేవలం వారి నియోజక వర్గంలో అభివృద్ధి కోసం మాత్రమే ఇలా చేశాను అని sanjay kumar తెలిపారు.
దీంతో ఆయన ఇప్పటికీ సాంకేతికంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగానే కొనసాగుతారని తేల్చి చెప్పేశారు.

నేను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే: సంజయ్‌ కుమార్‌
స్పీకర్ తీర్పుపై స్పందిస్తూ సంజయ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే. నా జీతం నుంచి ప్రతి నెలా రూ. 5,000 బీఆర్‌ఎస్‌ లెజిస్లేచర్‌ పార్టీకి విరాళంగా చెల్లిస్తున్నాను. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాను తప్ప, పార్టీ మారలేదు అని ఆయన వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో పార్టీ విప్‌ జారీ చేస్తే దానికి కట్టుబడి ఉంటానని కూడా ఆయన స్పష్టం చేశారు.

మొత్తం 8 మందికి క్లీన్ చిట్
తాజా తీర్పుతో కలిపి ఇప్పటివరకు మొత్తం 8 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేసినట్లయింది. గతంలో అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య వంటి నేతలకు కూడా ఇలాగే క్లీన్ చిట్ లభించింది.

ప్రస్తుత పరిస్థితి:
క్లీన్ చిట్ పొందిన వారు: అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌ రెడ్డి, టి. ప్రకాష్‌ గౌడ్‌, తెల్లం వెంకటరావు, సంజయ్‌ కుమార్‌.

విచారణలో ఉన్నవి: దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కడియం శ్రీహరి కేసు విచారణను స్పీకర్ ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు.

ఈ వరుస తీర్పులతో తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

https://varthaprabhanjanam.com/samsung-galaxy-s26-series-price-leak-europe-to-see-major-price-hike/amp/