Ajit Kumar Case : అబద్ధపు దొంగతనం కేసు – నిండు ప్రాణం బలి!!

Ajit Kumar Case

Ajit Kumar Case

పోలీసులకు గుణపాఠం చెబుతాం అని మద్రాస్ హైకోర్టు నిర్ణయం ,
తమిళనాడులోని శివగంగ జిల్లా మడపురం భద్రకాళి అమ్మన్ ఆలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న అజిత్ కుమార్ కస్టోడియల్ మరణంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

జూన్ 27న నగల దొంగతనం జరిగిందనే ఆరోపణతో పోలీసులు అజిత్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా అతని మీద వున కేసుకి సరి అయిన రుజువులు కూడా లేవు ,అయితే మరుసటి రోజే అతను మరణించాడు.
ఏ పాపం చేయని వ్యక్తిని అన్యాయంగా కొట్టి చంపారు అని జస్టిస్ శ్రీమతి ఆవేదన వ్యక్తం పరిచారు. కనీసం FIR కూడా లేకుండా అతన్ని అదుపులోకి తీసుకోవడాన్ని కోర్టు తప్పుబట్టింది ఈ కేసులో ఏదో తేడా ఉంది అని జస్టిస్ శ్రీమతి ఊహించారు.

నిజానిజాలు: CBI విచారణలో ఆ దొంగతనం ఫిర్యాదు అబద్ధమని తేలింది. అజిత్ కుమార్ శరీరంపై దాదాపు 40 గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదిక స్పష్టం చేసింది.

ప్రస్తుత పరిస్థితి: ఈ కేసులో నిందితులుగా ఉన్న పోలీసులకు బెయిల్ నిరాకరిస్తూ, విచారణ ముగిసే వరకు వారిని కస్టడీలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటికే ₹25 లక్షల పరిహారం ప్రకటించింది.

https://varthaprabhanjanam.com/telangana-speaker-dismisses-disqualification-petition-against-mla-sanjay-kumar/