Gold Price Today ​ : గోల్డ్ రేట్స్ అలర్ట్: మళ్లీ పెరిగిన ధరలు!

Gold Price Today

Gold Price Today

బంగారం అంటే ఇష్టమే కానీ కొనాలి అంటే మాత్రం మన ఆస్తులు అమ్ముకునేలా ఉంటునై మరి ఈ రోజు బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ బ్యాడ్ న్యూస్ అందింది. గత కొద్ది రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు, బుధవారం నుంచి మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం మరియు భారత్-అమెరికా మధ్య జరుగుతున్న ట్రేడ్ డీల్ ప్రభావంతో దేశీయంగా ధరలు ఆల్-టైమ్ రికార్డ్ దిశగా దూసుకెళ్తున్నాయి.

నేటి బంగారం ధరలు (10 గ్రాములకు):
దేశంలోని ప్రధాన నగరాల్లో ఫిబ్రవరి 5, గురువారం నాడు నమోదైన ధరలు ఇలా ఉన్నాయి:
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం: * 24 క్యారెట్ల (మేలిమి బంగారం): ₹1,59,450 (నిన్నటి కంటే ₹10 పెరుగుదల)
22 క్యారెట్ల (ఆభరణాల బంగారం): ₹1,46,160 (నిన్నటి కంటే ₹10 పెరుగుదల)
చెన్నై: ఇక్కడ ధరలు అత్యధికంగా ఉన్నాయి.
24 క్యారెట్ల ధర: ₹1,62,570
22 క్యారెట్ల ధర: ₹1,49,010
ఢిల్లీ: * 24 క్యారెట్ల ధర: ₹1,59,600
22 క్యారెట్ల ధర: ₹1,46,310

వెండి ధరల పరిస్థితి:
బంగారంతో పాటే వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. నిన్న ఒక్కరోజే కిలో వెండిపై సుమారు ₹20,000 పెరగగా, ఈరోజు కూడా ధరలు స్థిరంగా లేదా స్వల్ప పెరుగుదలతో కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, విజయవాడలలో: కిలో వెండి ధర ₹3,20,100 వద్ద ఉంది.
ఢిల్లీ, బెంగళూరు: ఇక్కడ కూడా కిలో వెండి ధర ₹3,20,100 గానే కొనసాగుతోంది.

ధరలు పెరగడానికి కారణాలు:
కేంద్ర బడ్జెట్ తర్వాత మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం మరియు గ్లోబల్ మార్కెట్లో బంగారంపై పెట్టుబడులు పెరగడం వల్ల ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొన్నటి వరకు తులం బంగారంపై దాదాపు ₹15,000 నుంచి ₹20,000 వరకు తగ్గి కొనుగోలుదారులకు ఊరటనివ్వగా, ఆ ఊరట కనీసం 2 రోజులు కూడా లేకుండా వెంటనే ఇప్పుడు మళ్లీ వేలల్లో ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసలు సామాన్యులు బంగారం కొనగలరా అనే స్థాయిలో లో బంగారం ధరలు పెరుగుతూ ,సామాన్యులకు నిద్రపట్ట నివ్వడం లేదు అనే చెప్పుకోవాలి.

https://varthaprabhanjanam.com/madras-high-court-on-ajit-kumar-custodial-death-will-teach-a-lesson-to-police/