India US Trade Deal 2026 : భారత్ ఎవరి దగ్గరైనా చమురు కొనుక్కోవచ్చు – ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా వ్యూహాత్మక స్పందన.

India US Trade Deal 2026

India US Trade Deal 2026

ఇటీవల భారత్ మరియు అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అందరికి తెలిసిందే, దానిపై రష్యా ఇలా స్పందించింది.రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ ఆపేస్తుందన్న వార్తలపై రష్యా అధ్యక్షుడి అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ, భారత్ ఏ దేశం నుండి అయినా చమురు కొనుగోలు చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది అని పేర్కొన్నారు. భారత్ తన అవసరాల కోసం రష్యాపై మాత్రమే ఆధారపడలేదని, ఇతర దేశాల నుంచి కూడా కొనుగోలు చేస్తోందని, ఇందులో కొత్తేమీ లేదని ఆయన స్పష్టంగా తెలిపారు .
అంతేకాకుండా, రష్యా నుంచి దిగుమతులు ఆపేస్తున్నట్లు న్యూఢిల్లీ నుండి తమకు ఎటువంటి అధికారిక సమాచారం రాలేదని రష్యా వెల్లడించింది వచ్చిననపుడు చూస్తాము అని తెలియజేసారు.

ఫిబ్రవరి 2, 2026న ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడిన అనంతరం, డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు.
ట్రేడ్ డీల్: భారత్ నుండి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై సుంకాలను (Tariffs) 50% నుండి 18%కి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ట్రంప్ కండిషన్: ఈ రాయితీకి బదులుగా భారత్ రష్యా నుండి చమురు కొనడం ఆపేసి, అమెరికా లేదా వెనిజులా నుండి కొనుగోలు చేయడానికి అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు.
అయితే, భారత ప్రభుత్వం ఈ ఒప్పందంలోని సుంకాల తగ్గింపును ధృవీకరించినప్పటికీ, రష్యా చమురు నిలిపివేతపై మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

భారత్-రష్యా చమురు బంధం
గత కొన్ని ఏళ్లుగా భారత్ మరియు రష్యా మధ్య చమురు వ్యాపారం భారీగా పెరిగింది:
పెరిగిన వాటా: 2021కి ముందు భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2% మాత్రమే ఉండేది. కానీ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, రష్యా తక్కువ ధరకే చమురు అందించడంతో భారత్ తన అవసరాల్లో దాదాపు మూడవ వంతు (1/3rd) రష్యా నుండే దిగుమతి చేసుకుంటోంది.
ఆర్థిక ప్రయోజనం: రష్యా నుంచి వచ్చే డిస్కౌంట్ ఆయిల్ వల్ల భారత్‌కు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తూనే ఉనయ్ అని తెలిపారు.

సాంకేతిక సమస్యలు: భారతీయ రిఫైనరీలకు రష్యా నుండి వచ్చే ఉరల్స్ వంటి భారీ రకం చమురు అలవాటు పడింది. కాబట్టి మరి భారత ప్రభుత్వం ఆ డీల్ ఉంచుకుంటుందా లేదా అని చూడాలి,అమెరికా ఇచ్చే షేల్ ఆయిల్ (Shale Oil) చాలా తేలికగా ఉంటుంది. కాబట్టి రష్యా ఆయిల్‌ను పూర్తిగా వదిలేయడం సాంకేతికంగా అంత సులభం కాదని నిపుణులు అంటున్నారు.

అమెరికా ఒత్తిడికి లొంగి భారత్ రష్యాతో ఉన్న పాత మిత్రత్వాన్ని వదులుకుంటుందా? లేదా తన సొంత ప్రయోజనాల కోసం ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ని పాటిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం భారత్ మాత్రం అమెరికాతో వ్యాపారాన్ని పెంచుకుంటూనే, రష్యాతో సత్సంబంధాలను కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది.

https://varthaprabhanjanam.com/ap-assembly-budget-sessions-2026-school-students-allowed-to-watch-live-proceedings/