మెఘాలయలో జరిగిన విషాద ఘటన దేశాన్ని షాక్‌కు గురిచేసింది. తూర్పు జైంటియా హిల్స్ జిల్లాలో ఉన్న అక్రమ బొగ్గు గనిలో పేలుడు సంభవించి కనీసం 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు అని తెలిసిన విషయమే. మరియు మరికొంత మంది గనిలో చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పేలుడు జరిగిన వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసులు కలిసి శోధన చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 16 మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో ఎంతమంది కార్మికులు ఉన్నారో ఇంకా స్పష్టంగా తెలియలేనినందున కచ్చితంగా చెప్పలేకున్నారు కానీ ఇంకా కార్మికులు లోపల ఉండే ఉంటారు అనే అంచనా.
ఈ ప్రమాదంలో గాయపడిన ఒక కార్మికుడిని మొదట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం షిల్లాంగ్ ఆసుపత్రికి తరలించారు. గనిలో పేలుడు ఎలా జరిగింది అన్నదానిపై అధికారులు విచారణ ప్రారంభించారు.
ఈ గని అక్రమంగా నడుస్తున్నట్లు ప్రాథమిక సమాచారం చెబుతోంది. మెఘాలయలో రాట్ హోల్ మైనింగ్ అనే ప్రమాదకరమైన గనుల తవ్వకం విధానం చాలా కాలంగా ఉంది. ఈ విధానంలో చాలా చిన్న సొరంగాలను తవ్వి, కార్మికులు లోపలికి వెళ్లి బొగ్గు తవ్వుతారు. ఈ సొరంగాలు చాలా ఇరుకుగా ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పర్యావరణ నష్టం, కార్మికుల ప్రాణాలకు ముప్పు కారణంగా 2014లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ విధానంపై నిషేధం విధించింది. తరువాత సుప్రీంకోర్టు కూడా ఈ నిషేధాన్ని సమర్థించింది. శాస్త్రీయ విధానాలు, భద్రతా నిబంధనలు పాటిస్తే మాత్రమే బొగ్గు తవ్వకాలకు అనుమతి ఇచ్చారు.
అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా గనులు నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ ఘటన కూడా అలాంటి అక్రమ గనిలోనే జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటి అన్నది విచారణ తర్వాత మాత్రమే తెలుస్తుంది అని తెలిపారు.
ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం సహాయం ప్రకటించే అవకాశం ఉంది. అలాగే అక్రమ గనులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదం మరోసారి అక్రమ గనుల ప్రమాదాలను గుర్తు చేసింది. ఇప్పటికీ అయిన ఇలా అక్రమ పనులు అవుతాయో ఉంటాయని కాదు లేదో చూడాలి, అలాగే కార్మికుల భద్రత కోసం కఠిన నియంత్రణలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
