Anthropic AI : భారత ఐటీ రంగానికి ఏఐ ముప్పు? ఆంత్రోపిక్ ‘క్లాడ్’ సంచలనంతో కుప్పకూలిన ఐటీ షేర్లు!

Anthropic AI

Anthropic AI

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా వున వ్యవసాయంతో పాటు ఐటి రంగం కూడా భారత దేశంనికి వెన్నెముకగా ఉంటుంది . ఐటీ (IT) రంగం ప్రస్తుతం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. అమెరికాకు చెందిన ఆంత్రోపిక్ (Anthropic) అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ విడుదల చేసిన కొత్త టెక్నాలజీ, భారతీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys) వంటి కంపెనీల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది.

ఇటీవల ఆంత్రోపిక్ సంస్థ తన ‘క్లాడ్ కోవర్క్’ (Claude Cowork) ఏజెంట్ కోసం కొన్ని కొత్త ‘ప్లగిన్’లను విడుదల చేసింది. ఇవి లీగల్ (న్యాయపరమైన), సేల్స్, మార్కెటింగ్ మరియు డేటా అనాలిసిస్ వంటి పనులను మనుషుల అవసరం లేకుండానే కూడా ఇవి స్వయంచాలకంగా (Automated) చేయగలవు.

సాధారణంగా ఇలాంటి పనుల కోసం విదేశీ కంపెనీలు భారతీయ ఐటీ సంస్థలపై ఆధారపడేవి. కానీ ఇప్పుడు ఈ ఏఐ టూల్స్ ఆ పనులను చాలా వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తున్నాయి. దీనివల్ల భారత ఐటీ కంపెనీల ఆదాయం తగ్గిపోతుందనే భయంతో స్టాక్ మార్కెట్‌లో ఐటీ షేర్లు భారీగా పతనమయ్యాయి.

ఆదాయం తగ్గడం: ఐటీ కంపెనీలు పనిచేసే గంటల ఆధారంగా (Billable Hours) బిల్లులు వసూలు చేస్తాయి. కానీ ఏఐ వల్ల పని త్వరగా పూర్తయితే, కంపెనీల ఆదాయం తగ్గుతుంది.
ఉద్యోగ అవకాశాలు: ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలోకి కొత్తగా వచ్చే ‘ఎంట్రీ లెవల్’ ఉద్యోగుల పనులను ఈ ఏఐ టూల్స్ సులభంగా చేసేస్తున్నాయి. దీనివల్ల ఫ్రెషర్ల నియామకాలు తగ్గే ప్రమాదం ఉంది.
పెట్టుబడుల ఉపసంహరణ: ఈ అనిశ్చితి వల్ల విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఐటీ రంగం నుండి వెనక్కి తీసుకుంటున్నారు.

ఐటీ పరిశ్రమల సమాఖ్య అయిన నాస్కామ్, ఇన్వెస్టర్ల ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేసింది. ఏఐ వల్ల ఐటీ రంగం అంతరించిపోదని, కేవలం పని చేసే విధానం మారుతుందని పేర్కొంది. భారతీయ కంపెనీలు ఇప్పటికే ఏఐ టెక్నాలజీని నేర్చుకుంటున్నాయని, సంక్లిష్టమైన ప్రాజెక్టుల నిర్వహణలో మనుషుల అవసరం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చింది.

ప్రస్తుతానికి ఐటీ షేర్లు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ, ఈ రంగాన్ని నాన్-పెర్ఫార్మింగ్ క్యాపిటల్ (లాభాలు లేని రంగం) గా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ట్రేడర్లు మరియు చిన్న ఇన్వెస్టర్లు ఐటీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది.

https://varthaprabhanjanam.com/todays-horoscope-feb-6-2026-financial-gains-for-these-zodiac-signs/