Aditya Mangal Yoga : ఆదిత్య మంగళ యోగం ప్రభావం: ఈరోజు ఎవరికీ అదృష్టం, ఎవరికీ జాగ్రత్త అవసరం?

Aditya Mangal Yoga

Aditya Mangal Yoga

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 ఫిబ్రవరి 10 మంగళవారం రోజు ప్రత్యేకమైన గ్రహ స్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తుండగా విశాఖ, అనురాధ నక్షత్రాల ప్రభావం ఉంటుంది. సూర్యుడు, కుజుడు, చంద్రుడు కలిసి ఆదిత్య మంగళ యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ శుభ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా మేషం, సింహం వంటి కొన్ని రాశుల వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులకు మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

మేష రాశి వారికి ఈరోజు పనుల్లో విజయం చాలా  బాగా ఉంటుంది. ఉద్యోగంలో సహచరుల సహాయం లభిస్తుంది. కుటుంబంలో సంతోషం కూడా ఉంటుంది. వృషభ రాశి వారికి పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కూడా మంచి సమయం గడుపుతారు.

మిథున రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి. మరియు ఉద్యోగంలో ఉన్నతాధికారుల మద్దతు కూడా  ఉంటుంది. కర్కాటక రాశి వారికి పనులు సకాలంలో పూర్తవుతాయి. మరియు బకాయిలు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

సింహ రాశి వారికి గౌరవం పెరుగుతుంది. మరియు పెండింగ్ లో వున్న పనులు పూర్తవుతాయి.
కొత్త వాహనం కొనాలనే ఆలోచన నెరవేరే అవకాశం ఉంది. కన్య రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో చిన్న సమస్యలు రావచ్చు కానీ ఆర్థికంగా బాగుంటుంది.

తుల రాశి వారికి పనుల్లో విజయం ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు ఆరోగ్యంపై జాగ్రత్త పడాలి కానీ ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి.

మకర రాశి వారికి కెరీర్‌లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావచ్చు. కుంభ రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి వారికి ఉద్యోగంలో మద్దతు ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి.

జ్యోతిష్య పరిహారాలుగా కొందరు హనుమాన్ చాలీసా చదవడం, శివుడికి అభిషేకం చేయడం, పేదలకు దానం చేయడం వంటి పనులు చేయవచ్చు.

https://varthaprabhanjanam.com/ap-swarna-grama-ward-ap-village-secretariats-renamed-as-swarna-grama/