Stomach Burning Relief: ఈ మోడరన్ కాలంలో చాలా మంది జంక్ ఫుడ్, బయట తినే ఆహారానికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. దాంతో కడుపులో మంట, గ్యాస్, మరియు అసౌకర్యం వంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయి. కొందరు వెంటనే మందులు, సిరప్లు వాడుతున్నప్పటికీ,అవి ఏమాత్రం పనిచేయడంలేదు సరైన ఆహారం తీసుకుంటే ఈ సమస్యలను సహజంగా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కడుపులో మంటకు ప్రధాన కారణం ఆమ్లత అంటే (అసిడిటీ). ఇది ఎక్కువగా వేడి ఆహారం, నూనె పదార్థాలు, మసాలాలు, ఒత్తిడి, అస్తవ్యస్తమైన జీవనశైలి మరియు నైట్ షిఫ్ట్స్ వల్ల వస్తుంది. అయితే కొన్ని సులభమైన ఆహారాలు రోజూ తీసుకుంటే కడుపు మంటను నియంత్రించవచ్చు.
మజ్జిగ కడుపుకు చాలా మంచిది. మజ్జిగలో కొద్దిగా వాము లేదా జీలకర్ర పొడి కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగుపడి మంట తగ్గిస్తుంది. అలాగే చల్లని పాలు చక్కెర లేకుండా తాగితే కడుపులో చల్లదనంగా ఉంటుంది.
కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం శరీరంలోని ఆమ్లతత్వాన్ని తగ్గిస్తుంది. అరటిపండు సహజ యాంటాసిడ్‌లా పనిచేసి కడుపును రక్షిస్తుంది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరం హైడ్రేటెడ్‌గా ఉండి మంటను తగ్గిస్తుంది.
భోజనం తర్వాత కొద్దిగా సోంపు గింజలు నమలితే గ్యాస్ సమస్య తగ్గుతుంది. అలాగే అల్లం టీ తాగితే కడుపులో వాపు, మంట తగ్గుతాయి. రోజూ రెండు లేదా మూడు తులసి ఆకులు నమలడం వల్ల కడుపులో ఆమ్ల స్థాయి నియంత్రణలో ఉంటుంది.
మందులకంటే ముందుగా ఆహారంపై శ్రద్ధ పెట్టడం వల్ల కడుపు సమస్యల నుంచి శాశ్వత ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జీవనశైలి ఉంటే కడుపు మంటకు దూరంగా ఉండొచ్చు.
