మహబూబాబాద్ జిల్లా తొర్రూరు Thorrur Municipality Clash మున్సిపల్ కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. మున్సిపల్ కార్యాలయం వేదికగా BRS పార్టీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సమాన బలంతో ఉండటంతో, మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఎక్స్ అఫీషియో ఓట్ల వినియోగంపై రెండు పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా తొర్రూరు మున్సిపాలిటీకి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ముదిరింది. ఉద్రిక్తతల మధ్యే ఎర్రబెల్లి దయాకర్ రావు PA పై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగారు.
