AP Free Smartphones: ఏపీ ప్రభుత్వం స్మార్ట్ నిర్ణయం.. వారికి ఉచితంగా రూ. 15 వేల సెల్‌ఫోన్లు!

AP Free Smartphones

AP Free Smartphones

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని AP Free Smartphones  గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్న యానిమేటర్లకు అద్భుతమైన వార్తను అందించింది. డ్వాక్రా మహిళలకు చేదోడు వాదోడుగా ఉంటూ, సంఘాల నిర్వహణ రికార్డుల నమోదులో కీలక పాత్ర పోషిస్తున్న యానిమేటర్లకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది.

విధి నిర్వహణలో సాంకేతికతను జోడించి పనులను మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో ఒక్కొక్కటి సుమారు రూ. 15,000 విలువ చేసే అత్యాధునిక ఫోన్లను వీరికి అందజేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 27,500 మంది యానిమేటర్లు విధుల్లో ఉండగా, వీరందరికీ ఈ ప్రయోజనం చేకూరనుంది. గతంలో 2014-19 మధ్యకాలంలో కూడా యానిమేటర్లకు ఫోన్లు అందించినప్పటికీ అవి పాతబడిపోయి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో కొత్తగా 5జీ ఫోన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కేవలం యానిమేటర్లే కాకుండా, క్షేత్రస్థాయిలో పనిచేసే సుమారు 5,000 మంది కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు కూడా ఉచితంగా సెల్‌ఫోన్లు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మండల స్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలు చూసే 600 మంది ఏపీఎంలకు పని సులభతరం చేసేందుకు ల్యాప్‌టాప్‌లు అందజేయనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ప్రారంభమై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ రజతోత్సవ కానుకగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.

ఇప్పటికే అంగన్‌వాడీ కార్యకర్తలకు 5జీ ఫోన్లు అందిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు వెలుగు విభాగం సిబ్బందిని కూడా సాంకేతికంగా బలోపేతం చేయడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రికార్డుల నమోదు మరియు డిజిటల్ డేటా అప్‌లోడింగ్ ప్రక్రియ ఇకపై మరింత పారదర్శకంగా, వేగంగా జరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. త్వరలోనే జిల్లా కేంద్రాల వారీగా ఈ ఫోన్ల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది.