Skip to content
Thursday, Nov 05, 2026
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • Cinema
  • Life Style
  • Technology
  • Sports
  • Gallery
varthaprabhanjanam.com | Latest Telugu News Website

varthaprabhanjanam.com | Latest Telugu News Website

Advertisment Image
National

SBI Minimum Balance Update: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..సేవింగ్స్ అకౌంట్లపై కేంద్రం కీలక ప్రకటన..!

prudhviMarch 10 10:05 am
SBI Minimum Balance Update

SBI Minimum Balance Update

SBI Minimum Balance Update: సాధారణంగా బ్యాంకులో అకౌంట్ ఉందంటే చాలు.. నెలాఖరు రాగానే అందులో కనీసం ఇంత డబ్బు ఉండాలి లేకపోతే పెనాల్టీ పడుతుందేమో అన్న భయం అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా సామాన్యులు, చిరుద్యోగులు ఈ విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇలాంటి వారి కోసం ఒక తీపి కబురు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 72 కోట్ల మంది ఖాతాదారులకు మినిమం బ్యాలెన్స్ నిబంధన వర్తించదని, ఒకవేళ ఖాతాలో డబ్బులు తక్కువగా ఉన్నా ఎలాంటి జరిమానాలు వేయకూడదని ఆమె స్పష్టం చేశారు.

పార్లమెంటులో ఈ అంశంపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన మంత్రి, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన అకౌంట్లు అన్ని బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు ఈ మినహాయింపు ఉంటుందని తెలిపారు. అంటే, ఈ ఖాతాల్లో రూపాయి లేకపోయినా (జీరో బ్యాలెన్స్) బ్యాంకులు ఒక్క పైసా కూడా పెనాల్టీ రూపంలో కట్ చేయడానికి వీల్లేదు. కేవలం మినిమం బ్యాలెన్స్ మాత్రమే కాదు, ఈ అకౌంట్లకు ఇచ్చే ఏటీఎం కార్డులు, నగదు ఉపసంహరణలు డిపాజిట్లపై కూడా ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశించింది.

మరోవైపు, సాధారణ సేవింగ్స్ ఖాతాల విషయంలో బ్యాంకులు తమ సొంత నిబంధనలు పాటించవచ్చని మంత్రి పేర్కొన్నారు. అయితే, ఈ చార్జీలు వసూలు చేసేటప్పుడు బ్యాంకులు హేతుబద్ధంగా ఉండాలని, కస్టమర్లపై పెను భారం పడకుండా చూసుకోవాలని సూచించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 8 వేల కోట్ల రూపాయలకు పైగా జరిమానాల రూపంలో వసూలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇది బ్యాంకుల మొత్తం ఆదాయంలో కేవలం 0.23 శాతం మాత్రమేనని, కేవలం నిర్వహణ ఖర్చుల కోసమే ఈ మొత్తాన్ని తీసుకుంటున్నట్లు బ్యాంకులు చెబుతున్నాయి.

ముఖ్యంగా మన దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ ఇప్పటికే 2020 మార్చి నుంచే సేవింగ్స్ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ నిబంధనను పూర్తిగా ఎత్తివేసింది. దీనిని అనుసరిస్తూ 2025 నాటికి మరో 9 ప్రభుత్వ బ్యాంకులు కూడా ఈ పెనాల్టీల భారాన్ని తగ్గించాయి. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, రైతుల పెట్టుబడి సాయం, మహిళలకు అందే ప్రభుత్వ పథకాల డబ్బులు ఇలాంటి చార్జీల వల్ల కట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బ్యాంకింగ్ సేవలను సామాన్యులకు మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్లను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి వివరించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, తక్కువ ఆదాయం ఉన్నవారు నిశ్చింతగా బ్యాంకింగ్ సేవలు పొందే అవకాశం ఉంటుంది. ఇకపై మీది బేసిక్ సేవింగ్స్ అకౌంట్ అయితే, బ్యాలెన్స్ తగ్గిందన్న దిగులు లేకుండా లావాదేవీలు చేసుకోవచ్చు.

Post Views: 83
Tagged Finance Ministry Update, Jan Dhan Accounts, Minimum Balance Rules 2026, Nirmala Sitharaman, Varthaprabhajanam, Zero Balance Account

Post navigation

⟵ Tollywood News: స్టాగ్రామ్ వేధింపులపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!
Indian Cricket Team News: అవన్నీ అబద్ధాలే.. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్..!! ⟶

Related Posts

LPG Crisis 2026
LPG Crisis 2026: భారత్‌కు చేరువలో గ్యాస్ నౌకలు.. సామాన్యులకు ఊరట లభించేనా?

LPG Crisis 2026: అంతర్జాతీయ రాజకీయ…

India US Trade Deal 2026
India US Trade Deal 2026: మోదీ-ట్రంప్ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం: భారత్‌లో తగ్గనున్న ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ ధరలు!

భారత్–అమెరికా మధ్య నెలల తరబడి కొనసాగిన…

Donald Trump Aliens Files
Donald Trump Aliens Files: గ్రహాంతరవాసులు నిజమేనా? మాజీ అధ్యక్షుడు ఒబామా వ్యాఖ్యలపై ట్రంప్ ఘాటు స్పందన..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి…

Latest posts

  • Ramayana Movie : బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.. ఆస్కార్ మ్యూజిక్‌తో వస్తున్న నైటెష్ తివారీ ‘రామాయణం’!
  • AP Housing Scheme: ఏపీ పేదలకు అదిరిపోయే తీపి కబురు.. టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!!
  • Stock Market: రూపాయి భారీ పతనం: డాలర్‌తో పోలిస్తే రూ. 95 మార్కు దాటిన విలువ.. ఆందోళనలో ఇన్వెస్టర్లు!
  • April 1 New Rules: బ్యాంకింగ్ అలర్ట్..‌ రేపటి నుంచే కొత్త బ్యాంకింగ్ నియమాలు..కస్టమర్లు ఇవి తెలుసుకోవాల్సిందే..!!
  • Hyderabad CNG Shortage: హైదరాబాద్‌లో సీఎన్‌జీ సెగ: 2 కిలోమీటర్ల మేర బారులు తీరిన ఆటోలు!
  • AP Govt E-Bicycle Scheme: ఏపీలో సబ్సిడీతో ఈ-సైకిళ్ల పంపిణీ.. స్కీమ్ పూర్తి వివరాలు ఇవే!
  • North Korea Flights: ఉత్తర కొరియా కీలక నిర్ణయం..గగనతల ఆంక్షలు ఎత్తివేత.. చైనా విమానానికి గ్రాండ్ వెల్కమ్..!
  • IPL Updates: సూర్య ఫిట్‌నెస్‌పై ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.
  • Middle East Conflict 2026: గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతే మా బాధ్యత.. పాలక్కాడ్ సభలో ప్రధాని మోదీ కీలక ప్రకటన..!
  • Tax Saving Tips: మార్చి 31 డెడ్‌లైన్.. ఈ పనులు పూర్తి చేయకపోతే భారీగా పన్ను కట్టాల్సిందే!
About us

Welcome to Varthaprabhanjanam your trusted source for rapid and reliable Telugu news. We deliver real-time updates on politics, cinema, sports, and technology. Our mission is to provide accurate, unbiased reporting that keeps the global Telugu community connected and informed every single day.

Most Viewed Posts
  1. Dhurandhar 2 Day 7 Collection : బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ కాసుల వర్షం.. వారం రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లో ‘ధురంధర్ 2’
  2. ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్: రూ. 17,000 విలువైన ఫ్రీ ఏఐ సర్వీస్ నిలిపివేత!
  3. Indian Army Operation : పాక్ ఉగ్రవాదులకు పాతాళంలోనూ చావు తప్పలేదు
  4. AP Budget 2026 : ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం – లోటు, వ్యయం వివరాలు ఇవే
  5. Critical Minerals : ​చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం…భారత్-అమెరికా బంధంలో సరికొత్త శకం!!
All copyrights by varthaprabhanjanam.com @2026 | Rapid News by Ascendoor | Powered by WordPress.